ఫ్యాక్ట్ చెక్: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ని పీఎం కేర్ ఫండ్ అని పిలుస్తున్నారా..?

-

తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక నకిలీ వార్త మనకి కనపడుతూనే ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా నమ్మితే నష్టం మీకే. ఇక ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వస్తోంది. దానికి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతున్న ఈ వార్తను ఏమిటి అనేది చూస్తే… రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ని పీఎం కేర్ ఫండ్ గా మార్చేశారని ఇందులో ఉంది. అయితే నిజంగా రాజీవ్ గాంధీ పౌండేషన్ పేరుని పీఎం కేర్ ఫండ్ కింద మార్చేసారా..? లేదా అనేది ఇప్పుడు చూద్దాం. PM మ్యూజియం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు ఇందిరా ఆవాస్ యోజన, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, మరియు PM కేర్స్‌ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కింద మార్చేశారు అని వార్త వినపడుతోంది.

అఫీషియల్ వెబ్ సైట్ పీఎం కేర్ ఫండ్ రిజిస్ట్రేషన్ ఆక్ట్ 1908 అండర్ కింద రిజిస్టర్ చేశారు. ఇది మార్చి 27, 2020 ఢిల్లీ లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా కొత్త ట్రస్ట్ మాత్రమే. అలాగే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ని జూన్ 21, 1991 న మొదలు పెట్టారు. 1991 నుండి 2009 వరకు ఎన్నో విషయాలపై ఈ ఫౌండేషన్ పని చేసింది.

ముఖ్యంగా విద్య మీద ఫోకస్ చేశారు. ఈ ఫౌండేషన్ కి సోనియా గాంధీ చైర్ పర్సన్. డాక్టర్ మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, చిదంబరం, ప్రియాంక గాంధీ ఈ ఫౌండేషన్ కి బోర్డు మెంబర్స్. అయితే రెండూ కూడా వేరు వేరు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ని పీఎం కేర్ ఫండ్ కింద మార్చలేదు ఈ రెండూ కూడా వేరు వేరుగా పని చేస్తాయి. దీంతో వచ్చిన వార్త నకిలీ వార్త అని తెలుస్తోంది. పైగా ఈ రెండు వేరు వేరు గా పని చేస్తాయి రెండింటికీ సంబంధం లేదు. వచ్సిన వార్త లో ఏ మాత్రం నిజం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version