ఫ్యాక్ట్ చెక్: పతాన్ సినిమా ఫ్లాప్ అయితే షారుఖ్ ఖాన్ ఇల్లుని అమ్మేస్తానన్నారా..? నిజమెంత..?

-

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ పతాన్ సినిమా కనుక ఫ్లాప్ అయితే తన ఇంటిని అమ్మేస్తాను అని చెప్పినట్లు ఒక వార్త వస్తోంది. అయితే ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త వస్తూనే ఉంటోంది. నిజానికి ఇటువంటి వార్తలను నమ్మారు అంటే అనవసరంగా మనమే చిక్కుల్లో పడాల్సి వస్తోంది.

 

ఫేక్ వార్తల తో జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో స్కీములు మొదలు ఉద్యోగాల వరకు చాలా ఫేక్ వార్తలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అభిమానుల తో మరియు ఆడియన్స్ తో పతాన్ సినిమా కనుక ఫ్లాప్ అయితే తన ఇంటిని అమ్మేస్తాను అని చెప్పాడని వార్త వచ్చింది.

పతాన్ సినిమా 25 జనవరి 2023 లో విడుదల అవుతుందని మూవీ మేకర్స్ చెప్పారు .అయితే ఈ వార్త నిజమేనా అని చుస్తే.. షారుఖ్ ఖాన్ ఆడియన్స్ తో మరియు ఫ్యాన్స్ తో ఈ విధంగా చెప్పలేదు అని తెలుస్తోంది. సినిమా కనుక ఫ్లాప్ అయితే ఇంటిని అమ్మేస్తాను అని అస్సలు షారుఖాన్ చెప్పలేదు.

కానీ సోషల్ మీడియాలో ఈ నకిలీ వార్త విపరీతంగా చక్కెర్లు కొడుతోంది. షారుక్ ఖాన్ కేవలం ఒక వీడియో ని పెట్టి సినిమా 25 జనవరి 2023 లో వస్తుందని మాత్రమే చెప్పారు. అంతే కానీ ఇంటిని అమ్మేస్తానని మాత్రం చెప్పలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version