స్ట్రాంగ్ అండ్ వీక్..ఏదయినా కథ ఉంటే కాదు..సక్సెస్ ఉంటే కలవండి..అప్పుడు మాత్రం ఇండస్ట్రీ మీ వైపు..మీతోనే.. మీ మంచితనంతోనూ..మీ చెడ్డ గుణంతోనూ.. ఉండి ఉంటుంది. భరిస్తుంది. కొంత లోటు ఏదయినా ఉంటే భర్తీ చేస్తుంది కూడా !
అందాక అంటే చాలా కాలం మీ పిల్లలూ..మీవైన కలలూ..ఇవన్నీ దూరంగా ఉంటూ పోతాయి..అప్పుడు మాత్రం మీరు మీతో పాటు మీ అనుకునే లోకం..మీలో స్వార్థం..మీ అనుకునే లోపలి ప్రయత్నం ఒకటి వెల్లువ..అప్పుడే సినిమాకో,జీవితానికో లేని అశ్లీలార్థాలు వెతుకు ! అందాక నీతో నీవు..నీకు నీవు ఓ వెలి..
డైలాగ్ మేక్స్ సెన్స్ ..సెన్స్ మేక్స్ సమ్ నాయిస్..అండ్ నోస్టాల్టియా..ఈ సారి మీరు ఓడిపోండి..ఒంటరిగా ఉంటే మీకు మీరు..మీతో మీ దుఃఖం మరియు దిగులు ఇవన్నీ ఒంటరి అవుతాయా..లేదు ! కదా ! ప్రపంచ గమనాన్నే మార్చేస్తున్న వైరస్సులు బాగున్నాయి..మనిషే బాగాలేడు..వాడు చస్తే ఇంకొందరి ప్రాణాలకు ఒకింత భరోసా ! కూడా ! కావొచ్చు ! లేదా కాకపోనూ వచ్చు ! భూగోళం పై మనిషి అన్న వాడు లేకపోతేనే బెటర్ అన్నది పూరి అనుకునే మాట. నిర్థారించే మాట కూడా ఇదే ! అసలీ బుజ్జిగాడు ఇక్కడోడు కాదు..మా పక్కనే నర్సీపట్నం..ఆ పక్కనే అనకాపల్లి..కొన్నిసార్లయినా జీవితంలో ఏడిస్తే నవ్వుల విలువ..కొన్ని సార్లయినా నవ్వులు దూరం అయితేనే గెలుపు విలువ.. తెలిసి వస్తుంది. నమ్మితే మోసం..నమ్మకం ఖరీదు ఏదయినా కావొచ్చు..అయినా వాడు పూరి..నేను..నందా వాడు బద్రీ..టెంపర్ మాత్రం నాదే !
డబ్బులు పోగొట్టుకుని ఏమయినా ఒక చోట ఆగిపోతే..ఏమయినా ఒక చోట ఒంటరి అని..గిల్టీనెస్ ను ఫీల్ అయి ఉంటే..
అవి కూడా పట్టించుకోకూడదు. 22 ఏళ్ల కిందట నేను ఎలానో ఇప్పుడూ అలానే..! ఔన్సార్ ! మీరు పెద్దవారు అయిపోయారు అని అంటున్నారు రేణూ..హా ! కాదు మీరు అప్పుడూ ఇప్పుడూ రాక్ స్టార్ అని మాత్రమే చెప్పగలను..చిన్న వేషం ఇవ్వండి ప్లీజ్.. చాలా రోజులయింది.. ఇలా నవ్వు తూ పోతున్నారు..ఆమె చాలా రోజుల కిందట ! నువ్వు నందా అయితే నేను బద్రి..నువ్వు రేణూ అయితే నేను పూరి..ఏమంటారయితే..!!!
డబ్బులు అయితే పోగొట్టుకున్నడు..వంద కోట్లు పోగేసుకుని పోగొట్టుకున్నడు..బుల్లెట్ లాంటి డైలాగ్ నూ, తుపాకీ వేగాన్నీ, నాటు తుపాకీ తూటాకు ఉండే వేగాన్నీ పోగొట్టుకున్నడా అంటే లేదు.. మీరు ఫ్లాట్ ఫాం మీద ఉన్నారు ఉండండి..మీరు ఎక్కాల్సిన రైలు ఎప్పుడు వస్తే అప్పుడే ఎక్కండి..కానీ అది వచ్చే దాకా వెయిట్ చేయడమే మీ లక్ష్యం.. ఏం లేదు ఇది జీవితం.. మీకింకా చెప్పనా నాలాంటి కష్టాలే నా బిడ్డలకూ కావాలి..వారికి కష్టం విలువ తెలిసిరావాలి..అని అంటారు పూరి.
సముద్రం అంటే ఎందుకు సర్ ఇష్టం..బీచ్ లో చచ్చిపోతారా..ఓరినాయినోయ్ ! నవ్వేడు ఆలీ..నవ్వేడు పూరీ..ఎప్పుడూ నవ్వులు ఇలానే ఉంటాయి..మీ సినిమా బ్లాక్ బస్టర్..నాతో పాటూ నలుగురికి తిండి..మీ సినిమా సూపర్..నాతో పాటూ నలుగురికి నీడ ..ఒకప్పుడు అన్నీ పోగొట్టుకుని ఉన్నావు కదా! ఏం చేద్దాం ? అప్పుడూ సినిమానే చేద్దాం.. నేనింతే.. మరి! చచ్చిపోతే తెలియదు ! తెలియాల్సిన అవసరమే లేదు..! ఇదివరకటి పోయెటిక్ టచ్ మరియు అప్రోచ్ కథల్లో లేదు ! ఏమయింది ? ఇట్లు పూరి .. అని కవితాత్మకంగా పలికే వాడు ఏమయిపోయాడు.. అని అడిగి చూడండి..లేదండి జనాలకు ఏం కావాలో అదే ఇస్తాను..నేను ఆ ఫీల్ తో ఇప్పుడు తీసినా ఒప్పుకోరు.. అయినా చూద్దాం..అని అంటారాయన.
ఇండస్ట్రీలో డెన్ లు ఉంటాయి..ఫ్యాక్టరీలు ఉంటాయి..పొగచూరిన బతుకులూ ఉంటాయి. నాకు తగ్గ పాట..నాకు తగ్గ మాట.. నాకు తగ్గ కథ ఉంటే చెప్పు అన్న వారే ఉంటారు. నీకు తూగినంత..నీకు పట్టినంత..నీకు నీవు విస్తారం అయిన చోట నన్ను తీసుకుపో అని ఎవ్వరూ చెప్పరు.! పూరి మరియు ఆర్జీవి లాంటోళ్లకు డబ్బులు పట్టవు.. అయినా డబ్బు పట్టింపు ఉంటే ఆ నోట్లను విసిరి కొట్టి మళ్లీ సంపాదించే గట్స్ ఉన్నోడు ఇప్పుడే కాదు ఎప్పుడు ఏం చెప్పినా బాగుంటుంది. ఏం కోల్పోయామో అన్నది ఊహ. ఏం తెచ్చిపెట్టుకున్నాం అన్నది ఊహ. ఈ రెండూ ఊహలే కావాలి..లేదా ఆ రెండు వాస్తవలయి ఊహలను అధిగమించాలి.
ఆరో తరగతిలో పూరీ జగన్నాథ్ కథ రాశాడు..ఇంకా ఏవేవో చదివాడు..కానీ ఆ చదువు, ఈ సంస్కారం ఇవన్నీ ఇంకొన్ని విలువలకు అదనం అయి ఉంటాయి అని అంటాడు..కానీ మీరు విలువలను నమ్ముకోవొద్దు అని మాత్రమే అంటాడేంటో ! అదే అర్థం కాదు..నేను నాతో బాగున్నా అని ఎవ్వరూ చెప్పరు..వాడొక్కడే ఈ ఒంటరితనం..ఈ నిర్బంధ క్షణం బాగున్నాయి అని చెప్పివెళ్తాడు..తీపి పూతల మాట ఒకటి వదిలి చాలా కాలం అయ్యిందేమో ! అయ్యో! బచ్చన్ సాబ్ ! వీడు బుడ్డోడు ఓ సిన్మా చేసేయ్యండి..అంటూ ఆర్జీవీ..బిగ్ బీకి చెప్పాడు. సర్! నా కథ వినండి ఏమయినా కరెక్షన్స్ ఉంటే చెప్పండి అంటూ పూరీ.. ఇలా తబ్బిబయితే సినిమా మరికొన్ని తప్పులు చేస్తే.. బచ్చన్ సాబ్..మెయిన్ లీడ్ లో బుడ్డా హోగా తేరా బాప్….
22 ఏళ్లు..ఏమయినా పోగొట్టుకున్నారా..మరో 22 ఏళ్లు.. ఏమయినా సంపాదించి వెళ్తారా ! తెలియదు సింహాలూ, తోడేళ్లూ ఉన్న రాజ్యంలో ఎన్ని ఏళ్లు.. ఉంటామన్నది అన్నది లెక్కల్లో..ఎలా బతికాం అన్నదే విలువల్లో ! మీతో మీరు ఇక్కడ దారి తప్పిపోతే బాగుండు అని అంటాడా ప్రకాశ్ రాజ్ ..అదే చేయండి.. పూరీ సర్.. దారి తప్పిపోండి.. ఏం కాదు..
– రత్నకిశోర్ శంభుమహంతి