బ్యూటీ స్పీక్స్ : అమ్మో ! బ్ర‌హ్మ.. మ‌రియు ఓ న‌గ్మా

-

ముంబ‌యి తీరంలో పుట్టిన వారు న‌గ్మా. అక్క‌డి నుంచి ఇటుగా వ‌చ్చి తెలుగు వారికి సుప‌రిచితం అయ్యారు న‌గ్మా. అమ్మ బ్ర‌హ్మ దేవుడో కొంప‌ముంచినావురో.. అని శ్రీ‌దేవిని చూసే కాదు న‌గ్మా ను చూసి కూడా హాయిగా పాడుకోవ‌చ్చు. పండు పండు పండు ఎర్ర పండు యాపిల్ దాని పేరు అని కూడా పాడుకోవ‌చ్చు. ఆ త‌రంలో ఆ క్ర‌మంలో ఆమె ఎన్నో మంచి పాట‌ల‌కు అభిన‌యించారు. అల‌రించి ఆక‌ట్టుకున్నారు. త‌న గ్లామ‌ర్ తో వీక్ష‌క‌కుల‌ను క‌ట్టిప‌డేశారు అని చెప్ప‌డం లో అతి లేదు. స్ట‌న్నింగ్ బ్యూటీ అంటారే అదే ఆమె. తొలుత స‌ల్మాన్ తో న‌టించారు. భారీ హిట్ కొట్టారు.
ఆయ‌న కెరియ‌ర్ కే బిగ్ స‌క్సెస్ బాగీ  ఎ రెబ‌ల్ ఆఫ్ ల‌వ్ సినిమాతో తెరంగ్రేట్రం చేశారు. త‌రువాత తెలుగులో అవ‌కాశాల కోసం ఆమె ప్ర‌య‌త్నించ‌కుండానే వ‌చ్చాయి. అందుకు త‌న స్నేహితురాలు దివ్య‌భార‌తినే కార‌ణం అని అంటారామె. ఆమె స‌ల‌హాతోనే తెలుగులో ఆమె తొలి చిత్రం పెద్దింటి అల్లుడు అయింది. ఈ చిత్రం త‌రువాత నాగార్జున తో కిల్ల‌ర్ లో న‌టించారు. మూడో చిత్రమే చిరుతో ఘ‌రానా మొగుడు కావ‌డం విశేషం.

ప్రేమ నిండిన క‌ళ్లు\\ మ‌త్తు నిండిన క‌ళ్లు..గ‌మ్మ‌త్త‌యిన అభిన‌యంకు చిరునామాగా నిలిచిన క‌ళ్లు.. న‌గ్మా.. ఆమె చెల్లి ఇద్ద‌రూ తెలుగు తెర‌కు ఇష్ట‌మ‌యిన వారు.ఎక్క‌డో ఉత్త‌రాది వారే కానీ ఆమె కానీ ఈమె కానీ మ‌న‌కు సుప‌రిచితం అని చెప్ప‌డం ఓ విధంగా ఆనందం మ‌రో విధంగా గ‌ర్వ‌కార‌ణం కూడా ! ఓ హీరోయిన్ కెరియ‌ర్ స్పాన్ ను ఇవాళ ఒక‌ట్రెండు సినిమాలే నిర్ణ‌యిస్తున్నాయి. ఆ త‌రువాత వాళ్లంతా క‌నుమ‌రుగు. కానీ న‌గ్మా ఓ ప‌దేళ్ల కాలం న‌టిగా రాణించి అల‌రించింది. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు సినిమాల్లో క‌నిపించి మెరిపించింది. మెగాస్టార్ తో న‌టించి స్టార్ డ‌మ్ కొట్టేసింది. నాగార్జున తో న‌టించి మెప్పించింది. అగ్ర హీరోల సినిమాల‌కు ఒక‌ప్పుడు కేరాఫ్. ఇంకా చెప్పాలంటే ఒన్ అండ్ ఓన్లీ  ఆప్ష‌న్ కూడా ఆమె.

90ల కాలంగా న‌గ్మా న‌గుమోము క‌న‌రే !న‌గ్మా ఒక్క‌రే కాదు ఆమె  చెల్లెళ్లు రోషిణి (చిరు న‌టించిన మాస్ట‌ర్ సినిమా మెరిసింది), జ్యోతిక (చిరు న‌టించిన ఠాగూర్ లో మెరిసింది) కూడా మెగా మానియాలో మెరిసిన వారే ! ఆమె కెరియ‌ర్ బ్రేక్ ఓ విధంగా ఘ‌రానా మొగుడు.. ఆ సినిమాలో ఆమె ప్ర‌ద‌ర్శించిన పొగ‌రుబోతుత‌నం హైలెట్.. రుసరుస‌లాడుతూ పోయే ఓ కంపెనీ బాస్ అంద‌మ‌యిన అమ్మాయి అయితే ఎలా ఉంటుంది..ఆమెను టీజ్ చేసే కుర్రాడిగా చిరు ఉంటే ఎలా ఉంటుంది.. ఆహా! అన్నీ మాటల‌కే కాదు చూపుల‌కూ ఎంతో బాగుంటాయి. అల‌రిస్తాయి. ఆక‌ట్టుకుంటాయి. థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేలా చేస్తాయి..ఆ ఈల ఓ గోల .. ఆ ఇద్ద‌రితోనే సాధ్యం.
ఎప్పుడో ఓ జ్ఞాప‌కం న‌గ్మా.. ఎప్పుడో ఓ మెరిసిన అందం న‌గ్మా.. అని కొట్టిపారేయ‌లేం. ఆమె అందం మ‌రియు అభినయం తెలుగు తెర‌కు సుప‌రిచితం. ఇప్ప‌టి న‌టీమ‌ణుల క‌న్నా  ఎంతో బెట‌ర్ అనిపించే న‌గ్మా. చాలా రోజుల త‌రువాత కూడా ఆమె న‌టించినా ఆ స్థాయి త‌గ్గ‌దు అని అనిపించుకునే న‌గ్మా. మ‌ళ్లీ తెలుగు తెర‌పై క‌నిపిస్తే ఆనందించాలి అని అనిపించే న‌గ్మా.. ఆమె ఫేస్ ట‌ర్నింగ్ ఇచ్చుకుంటే సినిమా హిట్టే ! ఆమె ఎడ‌మ చేతి వాటంతో న‌టిస్తూ పోతుంటే ఆడియెన్స్ ద‌గ్గ‌ర న‌వ్వులే న‌వ్వులు.
సినిమాల త‌రువాత ఆమె వైవాహిక జీవితంలో కొన్ని ఆటుపోట్లు వ‌చ్చాయి. క్రికెటర్ గంగూలీతో ప్రేమ వివాహం అనంతరం మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా వారిరువురూ విడిపోయారు. ఆ సంగ‌తి అటుంచితే మ‌ళ్లీ ఆమె తెరంగేట్రం చేస్తే మంచి  అవ‌కాశాలే ఆమెను వ‌రించ‌డం ఖాయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version