సిగిరెట్‌ తాగేవారి పక్కన నుల్చున్నా ప్రమాదమే.. ఏటా లక్షల్లో మరణిస్తున్న నాన్‌స్మోకర్స్‌..!

-

గొడవలకు వెళ్లడం తప్పు అంటారు..అలాగే ఎవరైనా గొడవపడుతుంటే..వాళ్లను ఆపకుండా పక్కనే ఉండి చోద్యం చూడడం కూడా అంతే తప్పు. చెడు అలవాట్లు మనకు లేకున్నా..పక్కనవారికి ఉన్నా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు తెలిసే ఉంటుంది…మద్యం తాగని వాళ్లకు దాని స్మెల్‌కే కడుపులో తిప్పేసినట్లు అవుతుంది. చాలా ఇబ్బంది ఫీల్‌ అవుతారు. సిగిరెట్‌ విషయంలో చాలామంది అంత ఇబ్బందిపడరు. రోడ్డుమీద వెళ్తుంటే చాలామంది సిగిరెట్‌, బీడీ బహిరంగ ప్రదేశాల్లోనే తాగేస్తూ..పొగ ఊదుతారు. కానీ సిగిరెట్‌ తాగేవాడికంటే..పక్కన ఉండి ఆ పొగను పీల్చేవారికే ఎక్కువ ప్రమాదం ఉంటుందట. ఇంట్లోనే ఎవరైనా సిగిరెట్‌ తాగుతుంటే..ఆ ప్రభావం ఇంట్లో ఉన్న అందరీ మీద పడుతుందని తాజా అధ్యయనాలు తేల్చిచెప్తున్నాయి.
చాలా మందికి పొగతాగే అలవాటు ఉండదు. అయినా ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారు. దానికి కారణం పాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. అంటే స్నేహితులు కాలుస్తుంటే పక్కన నిల్చుంటే…. ఆ పొగ మీ ముక్కు నుంచి ఊపిరితిత్తులకు చేరుతుంది. పొగ తాగిన వ్యక్తి కంటే పాసివ్ స్మోకింగ్‌లో పొగ పీల్చీన వ్యక్తికే అధిక రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఇప్పుడు మరో కొత్త అధ్యయనం సిగరెట్ అధికంగా పీల్చిన వారిలో కీళ్ల నొప్పులు లేదా రుమటాయిడ్ ఆర్ధరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెబుతోంది..ముఖ్యంగా చిన్న వయసులో సిగరెట్ పీల్చిన వారిలో పెద్దయ్యాక ఈ రుమటాయిడ్ ఆర్ధరైటిస్ తలెత్తే ముప్పు ఎక్కువ. రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌కు, ధూమపానానికి ప్రత్యక్షంగా సంబంధం ఉన్నట్టు చెప్పిన తొలి అధ్యయనం ఇదే.
సిగరెట్ కాల్చి వదిలిన పొగలో 4000 రకాల ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. అవి గాలిలో కలిసి మరింత ప్రమాదకరంగా మారతాయి. వాటిని పీల్చుకున్న వ్యక్తిలో ఇవి ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దీని ద్వారా ఊపరితిత్తులు క్యాన్సర్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. కేవలం ధూమపానం వల్ల కలిగే రోగాల వల్లే ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది మరణిస్తున్నారు. వీరిలో పది లక్షల మంది పొగ తాగని వారే ఉంటున్నారు.. పొగ తాగే వారి పక్కన నిల్చోవడమే వారి పాపం అవుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version