ముఖ్యమంత్రి మోరుగుడు మాని వర్షాలపై రివ్యూ చేయాలి – ఎంపీ అరవింద్

-

రెండు, రెండు గంటలు మీడియా సమావేశాలు మానేసి, భారీ వర్షాలపై రోజుకి ఒక రెండు గంటలు అయినా సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కి సూచించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇరిగేషన్ కి, డిస్టిక్ అడ్మిషన్ కి ఎటువంటి కోఆర్డినేషన్ లేదని అన్నారు. దానిపై దృష్టి పెట్టాలన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉండడం వల్లనే కోఆర్డినేషన్ లేదని అన్నారు. ఇరిగేషన్ అంటే డబ్బులు దోచుకోవడం ఒక్కటే తెలుసు అని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి సొల్లు కబుర్లు, మోరుగుడు మాని రోజుకు ఏడు గంటల పాటు రివ్యూ చేయాలని సూచించారు. రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయని, సెప్టెంబర్ వరకు తెలంగాణలో భారీ వర్షాలు పడే చరిత్ర మనదన్నారు. కాబట్టి ఇక నుంచైనా కొంచెం రివ్యూలు చేయాలన్నారు. తనని ఓ ముఖ్యమైన కమిటీకి ప్రతినిధిగా చేర్చినందుకు భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తనకు బాధ్యతలు ఇచ్చిన బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version