ఉలవచారు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈరోజుల్లో వీటి వాడకం తగ్గింది.. బేకరీల్లో ఉలవచారును స్పెషల్‌గా అమ్ముతున్నారు..పూర్వం రోజుల్లో అయితే అందరి ఇళ్లల్లో ఉలవలు వాడేవారు. ఇవి తినడం వల్ల కీళ్లనొప్పులు ఉండవు. గుర్రంకు ఉన్నంత శక్తి మనకు వస్తుంది. ఈరోజు మనం ఆరోగ్యకరంగా ఉలవలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా..!
ఉలవల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
నానపెట్టిన ఉలవలు ఒక కప్పు
టమోటా పేస్ట్ రెండు కప్పులు
పెరుగు అరకప్పు
కొబ్బరి తురుము అరకప్పు
ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
పచ్చిమిర్చి ముక్కలు పావుకప్పు
వెల్లుల్లి రెబ్బలు ఐదు
నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర ఒక టీ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
పసుపు కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా
కరివేపాకు కొద్దిగా
తయారు చేసే విధానం..
ఒక చిన్న ప్రజర్ కుక్కర్ తీసుకుని అందులో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, మీగడ వేసి ఇవి దోరగా వేడెక్కిన తర్వాత అందులో పసుపు, నానపెట్టిన ఉలవలు వేసి ఉడకటానికి టమోటా రసం పోసి, నిమ్మరసం వేసి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడకనివ్వండి. ఈ లోపు ఒక మిక్సీ జార్‌లో కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, పెరుగు వేసి లైట్ గ్రైండ్ చేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఉలవలు ఉడికిన తర్వాత అందులో ఈ పేస్ట్ వేయండి. కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర వేస్తే సరి.. ఉలవల గ్రేవీ కర్రీ రెడీ. ఎంతో రుచిగా ఉంటుంది. అంతకుమించి ఎంతో ఆరోగ్యం. ఎన్నో పోషక విలువలు ఉంటాయి కాబట్టి.. వారానికి ఒక్కసారి అయినా ఎదిగేపిల్లలకు ఉలవలు ఇస్తుంటే.. వారి ఎదుగుదలకు బాగా హెల్ప్ అవుతుంది. బలంగా ఉంటారు. ముసలి వాళ్లు కూడా.. ఉలవలతో గుగ్గీలు చేసుకుని తింటున్నా.. చాలు..డైజెషన్ సమస్య ఉంటుంది. ఇందులో ఉంటే పోషకాలు అన్నీ బాడీకీ బాగా హెల్ప్ అవుతాయి.