బిజెపి పాలిత రాష్ట్రాల్లో అన్ని సక్రమంగా ఉన్నాయా..? – సిపిఐ నారాయణ

-

ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఢిల్లీ వేదికగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ప్రధాని మోదీ విమర్శించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా మోడీ వ్యవహార శైలి ఉందని అన్నారు నారాయణ. అధికారం కోసం ఉత్తరాది, దక్షిణాది అని బిజెపి ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని, జాతీయ పార్టీలు బలహీన పడుతున్నాయని వ్యాఖ్యానించారు. సీపీఐ జాతీయస్థాయిలో బలోపేతం కావడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. జార్ఖండ్ లో సిపిఐ పార్టీ 9 సీట్లలో సొంతంగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇక మహారాష్ట్రలో ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఒక స్థానంలో పోటీ చేస్తుందని పేర్కొన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో అన్ని సక్రమంగా ఉన్నాయా అని ప్రశ్నించారు నారాయణ.

మూసీ నది ప్రక్షాళనను వ్యతిరేకిస్తే హైదరాబాద్ కి ద్రోహం చేయడమేనని అన్నారు. మూసి ప్రక్షాళన విషయంలో బిజెపి, బీఆర్ఎస్ రెండు పార్టీలు పోటాపోటీగా పోరాటం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇక వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కేసుల వ్యవహారం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసు 11 ఏళ్లుగా తేలలేదు కాబట్టే షర్మిల, జగన్ మధ్య ఇప్పుడు ఆస్తుల పంచాయితీ వచ్చిందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version