స్మార్ట్ ఫోన్ లో ఇలా ఈజీగా వై-ఫై కాలింగ్ ఆప్షన్ ని ఎంచుకోవచ్చు తెలుసా..?

-

రోజురోజుకీ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోంది. స్మార్ట్ ఫోన్లలో కూడా కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. అయితే వాటిలో వైఫై కాలింగ్ ఫీచర్ కూడా ఒకటి. వైఫై కాలింగ్ అనేది వైఫై నెట్వర్క్ సహాయంతో పని చేస్తుంది కాబట్టి మీ ఇంట్లో స్ట్రాంగ్ వైఫై సిగ్నల్ ఉంటే ఈ సేవలను ఉపయోగించచ్చు.

 

వైఫై కాలింగ్ అనేది వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెక్నాలజీని ఉపయోగించి కాల్ కనెక్ట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో విడుదలైన అన్ని ఫోన్లలో కూడా ఈ ఆప్షన్ ఉంది. ఒకవేళ కనుక మీ ఫోన్ లో ఈ ఆప్షన్ లేదు అంటే వైఫై ద్వారా కాల్ చేయడం అవ్వదు.

వైఫై కాలింగ్ ఆప్షన్ కోసం ఆక్టివేట్ చేయాలంటే ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ఈ విధంగా ఫాలో అవ్వాలి:

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి తర్వాత నెట్వర్క్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో నెట్ వర్క్ కి బదులుగా మొబైల్ నెట్వర్క్ లేదా కనెక్షన్ అని ఉంటుంది.
అక్కడ మీరు వైఫై ప్రిఫరెన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్ ని ఎంచుకోండి.
నెక్స్ట్ మీరు వైఫై కాలింగ్ పైన క్లిక్ చేయాలి.
మీ ఫోన్లో రెండు సిమ్ కార్డులు ఉంటే నచ్చిన సిమ్ ని సెలెక్ట్ చేసుకోండి.
కొన్ని ఫోన్లలో అయితే నేరుగా నోటిఫికేషన్ బార్ పై వైఫై కాలింగ్ ఆప్షన్ అని ఉంటుంది.

ఐఫోన్ యూజర్స్ ఈ విధంగా ఫాలో అవ్వండి:

మీ ఐ ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫోన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
మొబైల్ డేటా పై క్లిక్ చేసి వైఫై కాలింగ్ ని ఎంచుకోండి.
టర్న్ ఆన్ చేసిన తర్వాత టెలికాం ఆపరేటర్స్ నేమ్ కింద వైఫై అని కనబడుతుంది.
తక్కువ సిగ్నల్ ఉన్న చోట కూడా అంతరాయం లేకుండా ఫోన్ మాట్లాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version