ఉల్లికాడలతో ఇన్సులిన్ ఉత్పత్తి పెంచొంచు..సైంటిఫిక్ స్టడీలో తేలిన విషయం ఏంటంటే..!

-

ప్రైడ్ రైస్ లో, బిర్యానీల్లో, పలావుల్లో ఉల్లికాడలు ఉపయోగిస్తారు. ఉల్లిపాయలు తినని వాళ్లు కూడా..ఉల్లికాడలు తింటారు. ఉల్లిపాయలో బాగా సల్ఫర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి..కళ్లవెంబడి నీళ్లుకారతాయి. చాలామంది ఆధ్యాత్మికంగా తినటం మానేస్తారు. కానీ కాడలుగా ఉన్నప్పుడు ఆకుకూరల వలే దాని లాభాలు మనం పొందవచ్చు. ఉల్లికాడలను అందరూ ఉపయోగించుకుంటే మంచిది..ఈరోజు ఉల్లికాడల వలన ఏం ఏం లాభాలు ఉన్నాయి..ఎలాంటి పోషకాలు ఉన్నాయో చూద్దాం.

2015వ సంవత్సరంలో నేషనల్ హార్ట్ లంగ్ అండ్ బ్లడ్ ఇన్సిస్ట్యూట్- యూఎస్ఏ( National Heart Lung And Blood Institute- USA)వారు ఉల్లికాడల మీడ పరిశోధన చేసి ఇచ్చారు.

100 గ్రాములు ఉల్లికాడల్లో ఉండే పోషకాలు:

నీటి శాతం 90 గ్రాములు
శక్తి 32 కాలరీలు
మాంసకృతులు 2 గ్రాములు
కొవ్వులు 0.2
పిండిపదార్థాలు 7.3 గ్రాములు
ఫైబర్ 3 గ్రాములు
ఇవి ముఖ్యంగా ఉల్లికాడల్లో ఉండే పోషకవిలువలు.

ఉల్లికాడలను వంటల్లో వాడుకోవడం వల్ల వచ్చే లాభాలు:

ఇందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ వల్ల ప్రధానంగా డయబెటీస్ పేషెంట్స్ కి చాలా మంచిది. ఈ సల్ఫర్ కాంపౌండ్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇన్సులిన్ అనే హార్మోన్ ను ప్యాంక్ రీజ్( pancreas) అనే గ్రంధి ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ రక్తంలో చెక్కరను నియంత్రిస్తుంది. ప్యాంక్ రీజ్( pancreas) అనే గ్రంథిలో బీటాకణజాలం ఉంటుంది. ఈ కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి. మనకు రోజు సుమారుగా 40-50 యూనిట్ల ఇన్సులిన్ కావాల్సి ఉంటుంది. అయితే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటాకణాలు..మన జీవనశైలి సరిగ్గా లేనందువల్ల, ఒబిసిటీ వల్ల, మానసిక స్థితి సరిగా లేనందువల్ల ఇన్సులిన్ ను తక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.

ఎప్పుడైతే ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుందో..రక్తంలోకి వెళ్లిన చెక్కరను కణంలోపలకి పంపించే ఫెసిలిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే చెక్కర కణంలోపలకి వెళ్తుందో..అప్పుడు మనకు శక్తి వస్తుంది. అలా కాకుండా చెక్కెర అంతా రక్తంలోనే ఉంటే..ఫలితంగా మధుమేహం వస్తుంది. అంటే..మనిషి శరీరంలో సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి అయితే..ఈ సమస్యరాదు..ఉల్లికాడల ఇన్సులిన్ ఉత్పత్తి చేసే…బీటాకణాల ఉత్పత్తిని పెంచుతాయిని సైంటిఫిక్ గా నిరూపించారు. బ్లడ్ ఘగర్ లెవల్ ను కంట్రోల్ చేయడానికి, బ్లడ్ లో ఘగర్ లెవల్ పెరగకుండా నియంత్రించడానికి అందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్ స్టడీలో పేర్కొన్నారు.

మన ప్రేగుల్లో హెల్ప్ ఫుల్ బాక్టీరియా( Probiotics)ను పెంచడానికి ఉల్లికాడల్లో ఉండే కొన్ని కాంపౌండ్స్ బాగా ఉపయోగపడతాయట..అవి యసిటేటివ్, ప్రొపియోనేటివ్( Propionic acid) ఇలాంటివి అన్నీ ఉల్లికాడల్లో ఉండటం వల్ల ప్రేగుల్లో ఉండే గుడ్ బాక్టిరియాకు మంచి ఫుడ్ గా అంది వాటి డివిజన్ బాగా అయ్యి..ప్రేగుల్లో రక్షణ వ్యవస్థ బాగా పెరగడానికి, జీర్ణక్రియను మెరుగుచేయడానికి, పోషకాలు శరీరానికి గ్రహించుకునేట్లు చేయడానికి ఆ సూక్ష్మజీవులు బాగా ఉపయోగపడతాయి. వీటి ప్రొడెక్షన్ కు ఉల్లికాడలు హెల్ప్ అవుతాయి.

ఉల్లికాడల్లో విటమిన్ సీ, ఏ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థను బాగా బూస్ట్ చేయడానికి దోహదపడతాయి.
ఉల్లికాడలను సూప్స్ లో కూడా ఉపయోగిస్తారు.

ఉల్లికాడల్లో ఉంటే..ఫినోలిక్ కాంపౌండ్స్, ఫ్లేవనాయిడ్స్ యాంటివైరల్, యాంటిబాక్టీరియల్ గా బాగా పనికొస్తాయి. శ్లేష్మం ప్రొడెక్షన్ ను తగ్గించి దగ్గు, జలుబు రాకుండా చేయడానికి ఉపయోగపడుతున్నాయట.

కొలెస్ట్రాలన్ ను కొంతమోతాదు తగ్గించేందుకు కూడా ఈ కాడలు ఉపయోగపడుతున్నాయని పరిశోధకులు ఇవ్వటం జరిగింది.

సైంటిఫిక్ గా ఇలాంటి లాభాలు ఉన్నాయని తెలిసింది కాబట్టి..ఎప్పుడూ అందుబాటులో ఉండే..ఉల్లికాడలను తెచ్చుకుని వంటల్లో వాడుకుంటే..ఇలాంటి ప్రయోజనాలు అన్నీ పొందవచ్చు..

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version