IPL 2022 : యార్కర్ కింగ్ న‌టరాజన్‌పై ర‌విశాస్త్రి ప్ర‌శంస‌లు

-

ఐపీఎల్ 2022 లో భాగంగా సోమ‌వారం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగిన విషయం తెలిసిందే. కాగ ఈ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓడిపోయింది. బ్యాటింగ్ ఆర్డర్ విఫలం అవ‌డంతో రెండో మ్యాచ్ లోనూ ఓట‌మిపాలైంది. అయితే స‌న్ రైజ‌ర్స్ ఆట ప‌ట్ల చాలా మంది అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్.. యార్క‌ర్ కింగ్ టి. న‌ట‌రాజ‌న్ ఆక‌ట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవ‌ర్లు వేసిన న‌ట్టు.. కేవ‌లం 26 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు.

అలాగే 2 కీల‌క వికెట్ల‌ను కూడా ప‌డ‌గొట్టాడు. న‌ట్టు బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌నపై విమ‌ర్శ‌కులు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజా గా టీమిండియా మాజీ కోచ్.. ర‌వి శాస్త్రి కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో న‌ట‌రాజ‌న్ సేవ‌ల‌ను కోల్పోయాం అని అన్నారు. న‌ట్టు ఫిట్ గా ఉండే ప్రపంచ క‌ప్ తుది జ‌ట్టులో స్థానం ఉండేద‌ని అన్నారు.

న‌ట్టు ఆడిన తొలి టీ 20, వ‌న్డే మ్యాచ్ ల‌లో భార‌త్ విజ‌యం సాధించింద‌ని అన్నారు. అలాగే న‌ట‌రాజ‌న్.. యార్క‌ర్ల కింగ్ అని అన్నారు. స్పెషలీస్ట్ డెత్ ఓవ‌ర్ బౌల‌ర్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. కాగ న‌ట‌రాజ‌న్ గ‌త ఏడాది స్వ‌దేశంలో ఇంగ్లాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో గాయ ప‌డ్డాడు. దీంతో దాదాపు ఏడాది పాటు క్రికెట్ దూరం అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version