మానవులుకు మద్యం అలవాటు చేసింది కోతులేనని చెప్తున్న కొత్త అధ్యయనాలు..!

-

అసలు ఈరోజల్లో మద్యపానం అలవాటు లేని వాళ్లు ఉన్నారా..? అసలు ఉంటారా.. చాలా అరుదు కదా. అదేంటో.. తాగితే లివర్ పాడైతుందని తాగే ప్రతి ఒక్కడికీ తెలుసు.. అయినా మానరే.. కొందరు అకేషనల్గా తాగితే.. ఇంకొందరు తాగడానికే అకేషన్ చేసుకుంటారు.. ఇక ఈ వ్యసనం కేవలం అబ్బాయిలకే కాదు.. అమ్మాయిలకు పాకింది. మద్యపానాన్ని రుచి చూసిన ఎవ్వరూ రెండో పెగ్ వేయకుండా ఉండలేరు. అది ఇచ్చే కిక్కు అలాంటిదనుకోండి.. బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా.. రెండు బీర్లు తాగితే చాలు భలే మజా వస్తుందనేది మద్యంప్రియుల మాట.. అసలు మనిషికి ఈ మద్యపానం ఎందుకు ఇంత అలవాటు అయింది అని పరిశోధకులు తెలుసుకోవాలనుకున్నారట.. వారి అధ్యయనంలో ఓ గమ్మత్తైన విషయం బయటపడింది.

కోతులు తిన్న పండ్లు, వాటి మూత్ర నమూనాలను పరిశీలించారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాలను చూసి, శాస్త్రవేత్తలు షాక్ అయ్యారంట. కోతులు కేవలం ఆల్కహాల్ ఉన్న పండ్ల కోసం వెతుకుతూ ఉంటాయట… అవి పండిన తర్వాత కొంచెం కుళ్ళిపోతాయి. కోతి తినే పండ్లలో దాదాపు 2 శాతం ఆల్కహాల్ ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు.

రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన కథనం ప్రకరాం… బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన జీవశాస్త్రవేత్త రాబర్ట్ డడ్లీ 25 సంవత్సరాలుగా మానవులు మద్యపానానికి ఎందుకు బానిలవుతున్నారంటూ పరిశోధనలు చేస్తున్నారు. 2014లో, అతను దానిపై ఒక పుస్తకాన్ని (ది డ్రంకెన్ మంకీ: వై వి డ్రింక్ అండ్ అబ్యూజ్ ఆల్కహాల్) రాశాడు. ఇందులో మద్యం పట్ల మనుషులకు ఉన్న ప్రేమ కోతులు, లంగూర్ల ఫలితమేనని అతను పేర్కొన్నాడు. కోతులు, లంగూర్లు వైన్ వాసన కారణంగా పండ్లు పండే వరకు వేచి ఉంటాయి. ఆ మేరకు పండ్లలో ఆల్కహాల్‌ జాడలు కనిపిస్తున్నాయంట. ఆ తర్వాత వాటిని తింటాయనని ఆయన అంటున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన జీవశాస్త్రవేత్తలు మరో అధ్యయనం చేశారు. ‘డ్రంకెన్ మంకీ’ పరిశోధనకు ఫాలో అప్ లా ప్రస్తుతం మనుషుల్లో ఆల్కహాల్‌కు బానిస అవ్వడానికి గల కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. పనామాలో దొరికిన బ్లాక్ హ్యాండ్ స్పైడర్ కోతులను, అవి తిన్న పండ్లు, మూత్రం నమూనాలను సేకరించారు.

కోతులు జాబోలోని కొన్ని కుళ్లిన పండ్లను తినడానికి ఇష్టపడతాయని మళ్లీ ఈ అధ్యయనంలో తేలింది. ఇందులో ఆల్కహాల్ కంటెంట్ 1 నుంచి 2 శాతం మధ్య ఉంటుంది. ఇది సహజ కిణ్వ ప్రక్రియ నుంచి మాత్రమే వచ్చినట్లు తేలింది. ఈ పరిమాణం తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉండే బీర్‌తో సమానంగా ఉంటుంది. అంతే కాకుండా కోతుల మూత్రంలో కూడా మద్యం ఆనవాళ్లు కనిపించాయట. దీని నుంచి వారు శక్తి కోసం ఆల్కహాల్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించారు.

పరిశోధనలో పాల్గొన్న క్రిస్టినా క్యాంప్‌బెల్ మాట్లాడుతూ .. మొదటిసారిగా మనిషిని పోలిన కోతులు ఆల్కహాలిక్ పండ్లను తింటాయని నిరూపించగలిగాం. ఇది మొదటి అధ్యయనం మాత్రమే. దీనిపై మరింత కృషి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. మానవులకు మద్యం తాగాలనే కోరిక కోతులు ఆల్కహాల్ ఆధారిత పండ్లను తినడం వల్ల వచ్చిందా లేదా అని తెలుసుకోవడమే ఈ అధ్యయనాల ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన తెలిపారు.

మనిషి కోతి నుంచి వచ్చాడనేది జగమెరిగిన సత్యం.. మరి అలాంటప్పుడు మన అలవాట్లు కూడా కోతి నుంచే వస్తాయి కదా.. దీన్ని కొత్తగా పరిశోధన చేసి తేల్చేశారు..!

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version