అచ్చం సినిమా మాదిరి జరిగింది. దీనిని చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈమెకి కల వచ్చింది. అది నిజంగా నిజమయ్యింది. అదేమిటి అంత లేదు అనకండి. తాజాగా ఒక మహిళకి వచ్చిన కల నిజమయ్యింది. వివరాల లోకి వెళితే…. ఆమెకి ఏది అయితే కల వచ్చిందో అదే నిజ జీవితంలో జరిగింది… నిజంగా ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనిని చూశారంటే మీరు తప్పక ఆశ్చర్య పోవాల్సిందే.
ఆమె వివరాలని చూస్తే… ఇంగ్లండ్ కు చెందిన కరోలన్ బ్రూస్ అనే మహిళకు ఈ మధ్య కాలంలో చాల కలలు వచ్చాయట. ఆమె వయసు 51 ఏళ్లు. ఆమె ప్రస్తుతం ఓ ఆస్పత్రి లో నర్సుగా చేస్తోంది.
ఇది ఇలా ఉండగా ఈమె కి ఒక కల వచ్చింది. అది ఏమిటంటే..? ఆమె చనిపోయినట్టు అదీ కాక రొమ్ము క్యాన్సర్ కు గురై, చనిపోయినట్టు కలగంది.
అయితే ఇలా జరిగే సరికి ఆమెకి అసలు నిద్ర పట్టేది కాదట. ఇలా జరగడం వలన ఆమెకి అనుమానం వచ్చింది. దీనితో ఆమె ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకుంది. టెస్ట్ లో తేలింది ఏమిటంటే…? నిజం గానే ఆమె రొమ్ము క్యాన్సర్ వుంది అని. ఇప్పుడు ఆమె ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటోంది. కలే ఆమెని సేవ్ చేసింది. కానీ ఇటువంటి కల నిజం అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.