వింత వీడియో: నూడిల్స్ తో చేసిన వింత పని..చూస్తే అవాక్ అవ్వాల్సిందే..!

-

ఒక ప్లేట్ నూడిల్స్ మీ ముందు పెడితే ఏం చేస్తారు..? ఎవరైనా సరే వెంటనే తినడం మొదలు పెట్టేస్తారు. ఎందుకంటే నూడిల్స్ అంటే అందరికీ ఇష్టమే. కానీ ఒక మహిళ మాత్రం నూడిల్స్ ప్లేట్ తను ముందు పెట్టగానే తినకుండా ఒక వింత పని చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మరి ఆమె చేసిన ఆ వింత పని ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. నిజంగా ఈ వీడియో ని కనుక మీరు చూశారంటే షాక్ అవుతారు. ఎందుకంటే తన ముందు నూడిల్స్ ని పెట్టుకుని తినకుండా స్వెటర్, స్కార్ఫ్ ని అల్లుతున్నట్లు నూడిల్స్ తో ఆమె అల్లడం మొదలు పెట్టింది.

రెండు చాప్స్టిక్స్ ని పట్టుకుని ఆమె నూడిల్స్ ని అల్లుతోంది. ఈ వింత వీడియో ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. టిక్ టాక్ లో ఈ ఒరిజినల్ వీడియో పోస్ట్ చేయగా.. ఇప్పటికి ఈ వీడియోని ఏడు మిలియన్ల మంది చూశారు. కొందరైతే ఈ వీడియో పై కామెంట్లు కూడా చేశారు. కొన్ని మీమ్స్ కూడా ఈ వీడియో పై వచ్చాయి. మరి మీరూ ఆ వింత వీడియోని చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version