బతుకమ్మ పేరు వినగానే తెలంగాణ గుర్తుకు వస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. అయితే ఈ పండుగ స్పెషల్ గా ఎన్నో వంటకాలు నోరూరిస్తాయి.అందులో మలిదా లడ్డూలు ఒకటి. మరి ఈ లడ్డూలను ఎలా తయారుచేసుకోవాలో,కావలసిన పదార్థాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం…
కావాల్సిన పదార్థాలు..
250 గ్రాములు – గోధుమ పిండి
50 గ్రాములు – మీడియం సైజు రవ్వ (1/2 కప్పు)
1 టేబుల్ స్పూన్ – ఉప్పు (రుచికి తగ్గట్టుగా)
150 గ్రాములు – తురిమిన బెల్లం (1 కప్పు)
1/2 కప్పు – నీరు లేదా పాలు
1/2 కప్పు – తరిగిన గింజలు (జీడిపప్పు, బాదం, పిస్తా, మొదలైనవి)
1 టీస్పూన్ – యాలకుల పొడి
1/2 టీస్పూన్ – సోంపు గింజల పొడి
తయారీ విధానం..
ముందుగా గోధుమ పిండిని, రవ్వను ఒకే దగ్గర కలిపి.. వాటిలో నెయ్యి మిక్స్ చేయండి. ఆ తర్వాత పాలు లేదా నీటిని వేసి చపాతీ పిండిలా కలుపుకోండి. ఈ పిండిని 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత మీడియం సైజు పిండి బంతులను తయారుచేయండి. వీటిని చపాతీలుగా కాల్చండి. కాల్చేటప్పుడు నెయ్యిని ఎక్కువగా ఉపయోగించకూడదు. చపాతీలు గుండ్రంగానే ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మలిదా తయారీకి మనం మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి కాబట్టి.ఆ తర్వాత ఒక కడాయిని తీసుకుని స్టవ్ పై పెట్టి అందులో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి.. అన్ని పదార్థాలను వేయించి పక్కన పెట్టుకోవాలి.
చపాతీలు చల్లారిన తర్వాత చేతులతో లేదా మిక్సర్ ను ఉపయోగించి చపాతీలను చూర్ణం లా తయారుచేయండి. ఒకవేళ మిక్సర్ ను ఉపయోగిస్తే బాగా గ్రైండ్ చేయకూడదు. కొంచెం గరుకుగా ఉండేట్టు చూసుకోవాలి. యాలకుల పొడి, తురిమిన కొబ్బరి, సోంపు గింజల పౌడర్, తరిగిన ఎండు ద్రాక్షలు, డ్రై ప్రూట్స్, తురిమిన బెల్లం, శెనగపప్పు వంటి పదార్థాలన్నింటిని బాగా కలపండి. చేతులకు కొద్ది కొద్దిగా నీటిని అద్దుకుని లడ్డూలా తయారుచేసుకుంటే సరి. అలాంటప్పుడు బెల్లం సిరప్ ను తయారుచేయండి. ఇందుకోసం టీ స్పూన్ బెల్లం తీసుకుని 1 టేబుల్ స్పూన్ నీటిలో కరిగించండి. ఇది చల్లారిన తర్వాత మలిదాలో వేయండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మీడియం సైజు బాల్స్ ను తయారుచేయండి. ఇంకేముంది రుచిగల మలిద లడ్డు తయారైనట్టే..మీకు నచ్చితే మీరు ట్రై చెయ్యండి..