ప్రభుత్వ నిర్ణయాల్లో పీసీసీ కార్యవర్గ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కష్టపడి పని చేసిన వారికి నామినేటేడ్ పోస్టులు ఇస్తామని స్పష్టం చేశారు. సమర్థులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పదవులు పొందిన వారు కష్టపడితే రెన్యువల్ చేస్తామని లేకపోతే కొత్త వారికి అవకాశం ఇస్తామని తెలిపారు.
విదేశీ పెట్టుబడులు తెచ్చింది తెలంగాణ అని తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్, మార్కెట్ చైర్మన్, టెంపుల్ కమిటీలలో ఖాళీలు, జిల్లాల్లో నామినేటేడ్ పోస్టులు తదిర పోస్టులను మార్చి 10లోపు భర్తీ చేసే లిస్ట్ తయారు చేస్తామని తెలిపారు. మరో విడతలో పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు వస్తాయని తెలిపారు.