దీపావళి స్పెషల్: మలై గులాబ్ జామూన్ ఇలా చేసుకోండి..

-

దీపావళి పండుగ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది..అప్పుడే ఇళ్ళలో పనులు మొదలు పెట్టేశారు. ముఖ్యంగా దీపావళికి ఇంటి డెకరేషన్ లైట్స్ అలకంరణతో పాటు, పిండివంటలకు చాలా ప్రత్యేకత ఉంది. అందులోనే వెరైటీ స్వీట్స్ తో ఇంటిల్లి పాదీ ఎంజాయ్ చేస్తారు. అంతే కాదు, ఇంటికి వచ్చిన అతిథులకు, స్నేహితలుకు కూడా అద్భుతమ రుచులను అంధించి ప్రశంసలు పొందుతారు. ఈ దీపావళి సమయంలో అనేక రకాల స్వీట్స్ తయారుచేస్తుంటారు. సాంప్రదాయంగా లడ్డు, బర్ఫీ, గుజియా మరియు గులాబ్ జామూన్ ఎక్కువ. మరి కొంత డిఫరెంట్ టేస్ట్ కావాలంటే, మలై గులాజ్ జామూన్ చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది..చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా..ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చుద్దాము..

 

 

 

 

 

 

 

 

 

కావలసిన పదార్థాలు..

క్రీమ పౌడర్ మిల్క్: 1cup
సూజి: 4tbsp
మైదా: 4tbsp
పాలు: 1cup(పిండి తయారుచేయడానికి)
బేకింగ్ పౌడర్: ½tsp వేయించడానికి
నెయ్యి ఫిల్లింగ్ (నింపడం)కోసం
క్రీమ్/మలై: 1cup
కొబ్బరి తురుము : ½
చక్కెర సిరప్ కోసం
చక్కెర: 2 cups
నీళ్ళు: 2 cups

తయారీ విధానం:

ముందుగా మైదాపిండి, సూజి(రవ్వ), పాలపొడి, పాలు, బేకింగ్ పౌడర్ మరియు నెయ్యి అన్నింటిని ఒక బౌల్లోకి వేసి మెత్తగా, మ్రుదువుగా చపాతీ పిండిలా కలిపి 2నుండి 3గంటలపాటు పక్కన పెట్టుకోవాలి. మూడు గంటల తర్వాత తిరిగి కొద్దిగా పాలు పోసి మళ్ళీ సాఫ్ట్ గా కలిపి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి స్టిఫ్ గా తాయారవుతుంది. ఇప్పుడు స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. మీడియం మంట పెట్టి నూనె కాగనివ్వాలి. అంతలోపు ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.

చిన్న ఉండలు చుట్టే ముందు, చేతికి నెయ్యి రాసుకోవడం వల్ల తేలికగా సాప్ట్ గా జామూన్ బాల్స్ తయారవుతాయి. ఇప్పుడు గ్యాస్ మరో బర్నల్ మీద ఫ్రయింగ్ పాన్ పెట్టి, నెయ్యి వేసి, వేడయ్యాక అందులో జామూన్ బాల్స్ వేసి, బ్రౌన్ కలర్ వచ్చేవరకూ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ లోకి మారగానే వాటిని తీసి, షుగర్ సిరఫ్ లో వేసి, పదినిముషాలు నాననివ్వాలి. తర్వాత ఒక్కొ గులాబ్ జామ్ కి చిన్న గాటుటా పెట్టి లోపల మలైను నింపాలి, తర్వాతా గులాబ్ జామూన్ల మీద తాజా కొబ్బరి తురుమును వేసి సర్వ్ చేయాలి. అంతే దీపావళి స్పెషల్ స్వీట్ రిసిపి రెడీ..మీరు కూడా ఈ స్వీట్ ను తయారు చేసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version