నవరాత్రుల సమయంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి పూజలు చేయడం.. వివిధ రకాల నైవేద్యాలని సమర్పించడం.. ఇలా ఎవరికి తోచిన వాటిని వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యల నుంచి బయట పడాలన్నా మంచి జరగాలన్నా ఇలా చేయడం మంచిది. దేవి నవరాత్రుల్లో పసుపు పరిహారం చేస్తే జన్మజన్మల దరిద్రం పోతుంది. ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చని జ్యోతిష్యులు చెప్తున్నారు. పసుపు అమ్మవారికి ఎంతో ఇష్టం. నవరాత్రుల్లో పసుపుకి సంబంధించిన అద్భుతమైన పరిహారం పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి లభిస్తుంది. అక్కడ అమ్మవారి పూజకు ఉపయోగించిన పసుపులో కొంత భాగాన్ని ఇంటికి తీసుకురండి.
అలా తెచ్చుకున్న పసుపుని మీ ఇంట్లో ఉన్న పసుపుతో కలపాలి. తర్వాత మొత్తం పసుపును వెండి భరిణలో ఉంచి ఆ భరణిని పూజ మందిరంలో పెట్టాలి. ఇలా ఉంచాక నవరాత్రుల నుంచి ప్రతి రోజు పూజ చేసుకునేటప్పుడు ఆ భరిణి వద్ద పువ్వులు ఉంచి ధూపం సమర్పించి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వలన త్వరలోనే మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
దేవి భాగవతంలో కూడా ఈ విషయం చెప్పబడింది. అలాగే కుజదోషం తొలగిపోవాలంటే అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారి పూజకు ఉపయోగించిన పసుపులో కొంత భాగం తీసుకువచ్చి తమలపాకులో పెట్టి ఆ పసుపు నీ ముద్దలాగ చేసుకోవాలి. ఆ ముద్దను మంగళ గౌరీ స్వరూపంగా భావించి అక్షితలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీ దేవ్యే నమః అని 21సార్లు జపించాలి తర్వాత హారతి శ్రీ బెల్లం ముక్కనే నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే కుజదోషం తొలగిపోతుంది.