Raksha Bandhan : రాఖీ విషెస్​, స్పెషల్ కోట్స్ ని మీ ఆత్మీయులతో షేర్ చేసుకోండి..!

-

Raksha Bandhan : ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో రక్షాబంధన్ ని జరుపుకుంటూ ఉంటాము. రక్షాబంధన్ నాడు ఎంత దూరంలో ఉన్న వాళ్లకైనా సరే విషెస్ ని పంపించడం, రాఖీ పంపించడం చేస్తూ ఉంటాము. దగ్గరగా ఉంటే స్వయంగా రాఖీ కట్టి సంతోషంగా జరుపుకుంటూ ఉంటాము. సోదరులు, సోదరీమణుల ఎంతగానో ఎదురు చూసే రాఖీ పండుగ వచ్చేస్తోంది. తోబుట్టువుల అనుబంధానికి ప్రత్యేకంగా జరుపుకునే ఈ పండుగ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. సోదరులు సంతోషంగా ఉండాలని క్షేమంగా ఉండాలని కోరుకుంటూ రాఖీని కడతారు. రాఖీ పండుగ నాడు ఈ విషెస్ ని మీ అన్నదమ్ములతో అక్కచెల్లెళ్లతో పంచుకోండి.

  • నీ అల్లరి నాకు సంతోషం. ఎప్పటికీ నువ్వు నవ్వుతూ ఉండాలి. నీకు తోడుగా ఈ అన్నయ్య ఉన్నాడు. చిట్టితల్లికి రక్షాబంధన్ శుభాకాంక్షలు.
  • భుజాల మీద ఎత్తుకొని పెంచావు. అమ్మానాన్నల్లా నన్ను చూసుకుంటావు. నీ ప్రేమే నాకు కొండంత అండ. నన్ను దీవించు అన్నయ్య. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
  • అమ్మ తర్వాత అమ్మవి నువ్వు. నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. నా అల్లరిని ఎన్నోసార్లు భరించావు. నాకు కష్టం వస్తే తట్టుకోలేవు. అక్కా నువ్వంటే నాకు ప్రాణం. హ్యాపీ రక్షాబంధన్.
  • మన మధ్యనున్న ప్రేమ బంధం ప్రతి ఏడాదికి బలపడుతూ ఉంటుంది. ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ రక్షాబంధన్..
  • తమ్ముడూ నా జీవితంలో నువ్వు ఎంతో ప్రత్యేకం. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రక్షాబంధన్ శుభాకాంక్షలు.
  • నీలాంటి అక్క ఉండడం నా అదృష్టం, నువ్వు జీవితాంతం ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ రక్షా బంధన్.
  • కష్టసుఖాల్లో, ఆపద సమయాల్లో ఒకరికొకరు తోడుగా ఉందాం. రక్షాబంధన్ శుభాకాంక్షలు.
  • నా ప్రియమైన సోదరుడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడు సంతోషంగా క్షేమంగా ఉండాలి.
  • ప్రియమైన సోదరీమణులారా జీవితంలో అన్ని సంతోషాలు మీకు కలగాలని కోరుకుంటూ హ్యాపీ రక్షాబంధన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version