ఉగాది స్పెషల్.. పూర్ణం బూరెలు తయారు చేద్దాం ఇలా

-

మన దేశంలో సంప్రదాయానికి పెట్టింది పేరు. అందునా మన తెలుగు వారు ప్రతి పని సంప్రదాయాన్ని అనుసరించి చేస్తారు. ఏ శుభ కార్యములోనైనా చేసే వంటలు కూడా సంప్రదాయంగానే ఉంటాయి. పర్వదినాల్లో సైతం మన తెలుగు రుచులు మంచి సంకేతాలను తెలియ చేస్తాయి. ఇప్పుడు రాబోతున్న ఉగాదికి అందరి ఇళ్ళలో తప్పని సరిగా పూర్ణం బూరెలు, బొబ్బట్లు చేస్తారు.పుర్ణం బూరెలు లాగే కొత్త సంవత్సరంలో మన జీవితం కూడా సంపూర్ణం గా ఉండాలని ఆకాంక్షిస్తారు.

పూర్ణాలు తయారికి కావాల్సిన పదార్థాలు.. పావు కేజీ పచ్చి శనగ పప్పు , పావు కేజీ బెల్లం, పావు కేజీ లో సగం మినపప్పు , అంతే బియ్యం, అర కేజీ ఆయిల్, కొద్దిగా యాలకుల పొడి, చిన్న కొబ్బరి ముక్క.. ఇప్పుడు ముందుగా మినప్పప్పు, బియ్యం లో నీళ్ళు పోసి మూడు గంటల పాటు నాన పెట్టాలి. తరువాత నానిన మినప పప్పు, బియ్యం కడిగి కలిపి రుబ్బుకోవాలి. శనగ పప్పు కూడా కడిగి కుక్కర్ లో ఒకటికి రెండు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.

ఉడికించికున్న శనగ పప్పులో బెల్లం తురుము వేసి బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించి అందులో చిన్నముక్కలు గా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేయించి కలుపుకోవాలి. ఈ మిశ్రమం ఆరాక చిన్నచిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలి పెట్టి ఆయిల్ పోయ్యాలి. ఆయిల్ కాగాక శనగ పప్పు ఉండలు మినపపిండి లో ముంచి నూనెలో వెయ్యాలి. లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేగించి తీయాలి. ఇంతే వేడి వేడి పుర్ణాలు రెడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version