మనకి తెలిసిన పండ్లలో మనకి తెలియని ప్రయోజనాలు..

-

పండ్లలో ఉండే విటమిన్లు శరీరానికి ఎంతో అవసరం. మన చుట్టూ కనిపించే పండ్లలో మనకు తెలియని చాలా ప్రయోజనాలున్నాయి. ఒక్కసారి వాటిని తెలుసుకుని వాటి ప్రయోజనాలని పొందడం తెలుసుకోండి.

ఉసిరి:

కరోనా టైమ్ లో ఉసిరికాయలని ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ఉత్తమం. ఇందులో ఉండే విటమిన్ సి, జలుబును తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రస్తుతం సిట్రస్ ఫలాలకి ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. అందుకే ఈ సమయంలో ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. అదొక్కటే కాదు జీర్ణ సమస్యలని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఉసిరి కీలక పాత్ర వహిస్తుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు ఉసిరిని తమ డైట్ లో ఉంచుకోవాల్సిందే.

జామ:

జామ తినడం వల్ల శరీరంలో చక్కెర శాతం నియంత్రణలోకి వస్తుంది. ఆడవాళ్ళలో రుతుస్రావం సమయంలో కలిగే నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. క్యాన్సర్ బారి నుండి కాపాడుతుంది. చర్మం కాంతివంతంగా తయారవడానికి జామ ఎంతో మేలు చేస్తుంది.

సీతాఫలం:

ఇది సీజనల్ ఫ్రూట్.. ఐతే ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి.. శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. విటమిన ఏ కంటికి సంబంధించిన వ్యాధులని అరికట్టడంలో సాయపడుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవు.

నిమ్మ:

నిమ్మ కూడా సిట్రస్ ఫలమే. ఇందులో విటమిన్ సి ఉంటుంది. రక్తపీడనాన్ని (బీపీ) నియంత్రించడంలో, గుండె సంబంధిత వ్యాధులని అరికట్టడంలో, ఆస్తమా కలగకుండా, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడానికి బాగా సాయపడుతుంది.

సో.. మనచుట్టూ కనిపించే పండ్లలో కనిపించే పండ్లని అలా వదిలేయకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version