గడ్డ పెరుగును మిస్‌ అవుతున్నారా..? ఈ యోగర్ట్‌ మేకర్‌ తీసుకోండి..!!

-

కాలం మారిపోయింది. వంటగది మోడ్రన్‌గా తయారైంది. ఇంతకుముందు వంట చేయాలంటే.. కట్టెల పోయి మీద కష్టపడి వండాల్సింది వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. స్టైలిష్‌ గ్యాస్‌స్టవ్‌, కూరగాయలు కట్‌ చేసుకోవడానికి మంచి మంచి గాడ్జెట్స్‌ వచ్చేశాయి. అయితే గేద పెరుగు అంటే గడ్డగా ఉంటుంది. చాలా మందికి నచ్చుతుంది. ప్యాకెట్‌ పెరుగు టేస్టీగా ఉన్నా గడ్డగా అయితే ఉండదు. మీరు గడ్డ పెరుగు మిస్‌ అవుతున్నారా..? అయితే మీ కోసమే ఈ పరికరం. యోగర్ట్ మేకర్ గురించి తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది AGARO బ్రాండ్ నుంచి వచ్చిన క్లాసిక్ పోర్టబుల్ ఎలక్ట్రిక్ యోగర్ట్ మేకర్. దీని కెపాసిటీ 1.2 లీటర్లు. దీన్ని స్టెయిన్‌లెస్ స్టీల్ మెటీరియల్‌తో తయారుచేశారు. అందువల్ల ఇది తుప్పుపట్టదు. ఈ ప్రొడక్టు 16.5 x 16.5 x 11 సెంటీమీటర్ల డైమెన్షన్స్ కలిగివుంది. బరువు 800 గ్రాములు ఉంది.
దీనికి సంవత్సరం వారంటీ ఉంది. దీన్ని చైనాలో తయారుచేస్తున్నారు. ఇందులో 4 రకాల కుకింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అందువల్ల రకరకాల యోగర్ట్స్ చేసుకోవచ్చని కంపెనీ అంటోంది.

యోగర్ట్ స్మూతీలు, యోగర్ట్ ఫ్రూట్ కప్, గ్రీక్ యోగర్ట్, యోగర్ట్ సలాడ్ వంటివి చేసుకోవచ్చట. దీని అసలు ధర రూ.1,295 కాగా.. అమెజాన్‌లో దీనిపై 58 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.539కి అమ్ముతున్నారు. దీన్ని ఇప్పటికే 900 మందికి పైగా కొనుక్కున్నారు. 4.2/5 రేటింగ్ ఉంది. చాలా మందికి ఇది బాగా నచ్చుతోంది.

ఇప్పుడు కొన్ని ఫ్రిడ్జుల్లో కార్డ్‌ మేకర్‌ ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. అందులో గోరువెచ్చనిపాలు వేసి కాస్త పెరుగు వేసి.. సెట్టింగ్స్‌ మార్చుకుంటే గడ్డ పెరుగు రెడీ అవుతుంది. అలాంటి ఫ్రిడ్జ్‌ లేని వాళ్లు హ్యాపీగా 500 పెట్టి ఇది తీసుకుంటే మీరు గడ్డ పెరుగును ఎంజాయ్‌ చేస్తూ తినొచ్చు. ప్యాకెట్‌ పాలు, ప్యాకెట్‌ పెరుగు ఇన్‌స్టెంట్‌గా రెడీ అయిపోతాయోమో కానీ అవి మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. తప్పని సరిపరిస్థితుల్లో తప్పక చాలా మంది వీటికే అలవాటు పడుతున్నారు. కానీ పాలుతెచ్చుకుని వాటిని కాచుకోని మీరు పెరుగు రెడీ చేసుకుంటే ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన పెరుగును ఆస్వాదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version