పచ్చిబొప్పాయితో హల్వా.. సింపుల్‌గా టేస్టీగా ఇలా చేయండి..!

-

బొప్పాయిను అందరూ పండిన తర్వాతే తింటారు. పచ్చిబొప్పాయి తినేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అయితే కొందరు మాత్రమే.. పచ్చిబొప్పాయితో కూర వండుకుంటారు. మనం ఈరోజు పచ్చిబొప్పాయితో హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామా.. అయితే పచ్చిబొప్పాయిను గర్భవతులు తినకూడదు. రుతుక్రమంలో ఉన్నవారు కూడా తినకూడదు. అయితే పచ్చిబొప్పాయితో హల్వా చేయడం వల్ల ఎలాంటి హాని ఉండదు. ఎవరైన తినొచ్చు.

పచ్చి బొప్పాయి హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలు..

  • పచ్చిబొప్పాయి తురుము రెండు కప్పులు
  • పాలు 250ML
  • తేనె ఒక కప్పు
  • వేపించిన నువ్వుల పొడి అరకప్పు
  • జీడిపప్పు ముక్కలు రెండు టేబుల్‌ స్పూన్స్‌
  • బాదంముక్కలు రెండు టేబుల్‌ స్పూన్స్‌
  • పిస్తా ముక్కలు రెండు టేబుల్‌ స్పూన్స్‌
  • యూలకలపొడి కొద్దిగా
  • మీగడ కొద్దిగా

తయారు చేసే విధానం.

ముందుగా ఒక నాన్‌స్టిక్‌ పాత్ర తీసుకుని అందులో మీగడ వేసి పచ్చిబొప్పాయి తురుము వేసి 15 నిమిషాలు పాటు తిప్పుకుంటూ..అందులో వాటర్‌ తగ్గేవరకూ ఉడకనివ్వాలి. ఆ తర్వాత పాలు పోసి ఉడకనివ్వండి. దగ్గపడిన తర్వాత.. తేనె వేయండి. వాటర్‌ కంటెంట్‌ బాగా తగ్గే వరకూ ఉంచండి. అప్పుడు అందులో వేపించిన నువ్వుల పొడి వేయండి. ఇది వేయడం వల్ల హల్వా కమ్మగా ఉంటుంది. యాలుకపొడి కూడా వేసి తిప్పండి. మరొక నాన్‌స్టిక్‌ పాత్ర తీసుకుని అందులో జీడిపప్పు, పిస్తాముక్కులు, బాదంముక్కలు వేసి మీగడ వేసి దోరగా వేగనివ్వండి. వీటిని బొప్పాయి హల్వాలో వేయండి. హల్వాలో మధ్యమధ్యలో ఈ. ముక్కలతు తగులుతుంటే.. సూపర్‌ టేస్టీగా ఉంటుంది. రుచిగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బొప్పాయి హల్వా రెడీ.! ఎవరైనా ఎలాంటి డౌట్ లేకుండా తినేయొచ్చు.! ఇళ్లలో బొప్పాయి చెట్లు ఉన్నప్పుడు ఒక్కోసారి పచ్చిబొప్పాయిగా ఉన్నప్పుడే చెట్టు నుంచి రాలిపోతుంది. అది వేస్ట్‌ చేయకుండా.. ఇలా కూడా ట్రే చేయండి.! టేస్ట్‌కు టేస్ట్‌.. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటే ఇదే కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version