బరువు తగ్గాలనుకునేవారు.. డైలీ వీటిని తింటే చాలట..!

-

బరువు తగ్గాలని చాలామంది ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఫిట్‌గా ఉండటం అంటే.. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే.! ఇష్టమైనవి తింటూనే.. ఇంకోపక్క బాడీకి ఫిట్‌ ఇచ్చేవి తినాలి. బెల్లీ ఫ్యాట్‌ లేకుండా చూసుకుంటే…చూసేందుకు అందంగా కనిపిస్తారు. మరీ ఇప్పటికే బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతుంటే..ఈరోజు చెప్పే కొన్ని చిట్కాల వైపు చూడండి.. శరీరంలోని అధిక కొవ్వు గుండెపోటు, స్ట్రోక్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ కొవ్వును కరిగించడం చాలా ముఖ్యం. మీ శరీరంలో కూడా కొవ్వు పెరిగితే.. మీరు కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి.

పెరుగు తినండి:

పెరుగులోని సంయోజిత లినోలెయిక్ యాసిడ్ (CLA) కొవ్వును కరిగించేందుకు ప్రోత్సహిస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ బరువు తగ్గడానికి అవసరమైన గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. అమైనో ఆమ్లాలు, విటమిన్ డి, కాల్షియం కూడా కొవ్వును త్వరగా కాల్చడానికి సహాయపడతాయి.

అవోకాడో తినండి:

అవోకాడోలో కేలరీలు, కొవ్వు పరిమాణం ఎక్కువగా ఉంటుందని చాలా పరిశోధనలలో వెల్లడైంది. ఈ పండు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ పండును తినడం వల్ల ఆకలి త్వరగా వేయదు. ఈ పండు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీవక్రియకు సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని సైతం తగ్గిస్తుంది.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడంలో.. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దాల్చినచెక్కను తీసుకోవడం ద్వారా, జీవక్రియ వృద్ధి చెందుతుంది. ఊబకాయం వేగంగా తగ్గుతుంది. మీరు దాల్చిన చెక్కను ఆహారంలో లేదా టీలో కూడా తీసుకోవచ్చు. ఈ గరం మసాలా బరువును వేగంగా నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

గుడ్డు కొవ్వును నియంత్రిస్తుంది:

నాన్ వెజ్ తినని వారు కూడా గుడ్లు తింటున్నారు.. ఇది బరువు తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. గుడ్డులో ఉండే ప్రొటీన్ బరువును నియంత్రిస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే.. అల్పాహారంలో గుడ్లు తీసుకోవడం ద్వారా మీ రోజును ప్రారంభించండి.

బ్రకోలీ బెస్ట్ వెజిటబుల్

బ్రకోలీ తీసుకోవడం ద్వారా కూడా కొవ్వు వేగంగా కరిగిపోతుంది. బ్రోకలీలో అధిక ఫైబర్, మినరల్స్ ఉంటాయి, ఇవి శరీర కొవ్వును కాల్చడంలో ప్రభావవంతంగా ఉంటాయి. బ్రకోలీలో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా మార్చుతాయి. బరువును అదుపులో ఉంచుతుంది.

బరువు తగ్గాలనుకునేవారు.. వీటిని డైలీ డైట్‌లో భాగం చేసుకుంటే..రిజల్ట్‌ బాగుటుందని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version