మళ్ళి వీకెండ్ రానే వచ్చింది. ఆదివారం స్పెషల్ గురించి ఆలోచిస్తున్నారా. అయితే ఎప్పుడు వండుకునే చికెన్ ఏ గా అనుకోకండి. ఈ రోజు కాస్త వెరైటీ గా బోర్బోన్ చికెన్ తయారు చేసుకోండిలా. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా లాగించేస్తారు.
బోర్బోన్ చికెన్ కి కావలసిన పదార్థాలు:
2 కప్పుల బోన్ లెస్ చికెన్ చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
1-2 టేబుల్ స్పూన్ ల నూనె
అల్లం, వెల్లుల్లి, లవంగం పేస్ట్ .
1 టీ స్పూన్ కారం,
1/4 కప్ ఆపిల్ జ్యూస్,
1/3 కప్పు లేత గోధుమ రంగు చక్కెర,
2 టేబుల్ స్పూన్లు కెచప్,
1 టేబుల్ స్పూన్ సైడర్ వెనిగర్,
1/2 కప్ వాటర్,
1/3 కప్ సోయా సాస్.
తయారి విధానం: ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి బాణలి పెట్టి ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి లైట్ బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. తరువాత చికెన్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాణలి లో అల్లం, వెల్లుల్లి, మసాలా ముద్దా వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించి మిగిలిన పదార్థాలు అన్ని వేసి సన్నని మంట మీద బాగా మిక్స్ అయ్యే వరకు వేయించాలి. తరువాత చికెన్ కూడా వేసి అర కప్పు నీళ్ళు పోసి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి. అంతే వేడి వేడి బోర్బోన్ చికెన్ రెడీ.
బోర్బోన్ చికెన్ లోని పోషక విలువలు :
కేలరీస్ – 220 g – 42%,
కొలెస్ట్రాల్- 145.3mg- 48%,
సోడియం- 1573mg-65%,
కార్బోహైడ్రేట్స్ _ 23.4g – 7%,
డైటరీ ఫ్యాట్ _ 0.3g- 1%,
షుగర్స్ _ 21.5 g-85%,
ప్రోటిన్స్ _ 50.1g – 100%.