ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ దారుల విషయంలో.. కఠిన రూల్స్ అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీలో ఉన్న పెన్షన్ దారులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇందులో ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్ దారులలో.. అనర్హుల్గా ఉన్న వారిని తొలగించాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ తరుణంలోనే అందత్వం వినికిడి లోపం కాళ్లు అలాగే చేతులు దెబ్బతిన్న వారందరికీ వైద్య పరీక్షలు చేయబోతుంది చంద్రబాబు నాయుడు సర్కారు. దివ్యాంగుల కోటాలో 6000 పెన్షన్ పొందుతున్న వారందరికీ ఒకటి రెండు రోజుల్లో వైద్య పరీక్షలు చేసి… అనర్హులను తొలగించబోతుంది చంద్రబాబు సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది లబ్ధిదారుల్లో… 40 శాతం అనర్హులు ఉండవచ్చని ఇప్పటికే నివేదికలు చెబుతున్నాయి. అలాగే అవయవాలు బాగా ఉన్నా కూడా కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని పెన్షన్ పొందుతున్నారట. వారందరినీ ఏరిపారేసేందుకు ఈ వైద్య పరీక్షలు నిర్వహించనుంది.