పిజ్జా బేస్ కు మైదానే వాడాలా..?ఇన్ని రకాల పిండులు ఉన్నాయో తెలుసా..!

-

ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం..మనం తినే జంక్ ఫుడ్స్. ఈ జంక్ ఫుడ్స్ లో ఫస్ట్ ఉండే పేరు..పిజ్జా. ఈ పిజ్జా బేస్ లో మైదాపిండి వేసి..సాస్ లు ఛీస్ వేసి ఎంతో టేస్టీగా చేస్తారు. కానీ మైదావాడకం మంచిది కాదు కదా..ప్రకృతి పరంగా ఈ పిజ్జా బేస్ కి ఏదైనా ప్రత్యామ్యాయం ఉందా? అంటే ఎందుకు లేదు ఉంది అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.
అనారోగ్యకరమైన మైదాపిండి వాడే బదులు..ఆరోగ్యకరమైనా పిండులు అనేకం ఉన్నాయి. పిజ్జా మానక్కర్లేదు..హెల్తీగా తింటం తెలుసుకుంటే చాలు..అసలు ముందు మైదావల్ల వచ్చే నష్టాలు చూద్దాం.
గోధుమల్లోనే పోషకాలు తక్కువగా ఉంటాయి. అలాంటి గోధుమను పాలిష్ ను పట్టడంతో..పై లైయర్స్ లో ఉండే పోషకాలు అన్నీ పోతాయి. లోపల వాటిని పిండిపట్టిస్తే గోధముపిండి వస్తుంది. దీన్ని రిఫైన్ చేస్తే..వచ్చేది మైదాపిండి. ఈ మైదాపిండి ఎవరైతే ఎక్కువ వాడతారో..ఇందులో పోషకాలు ఏం ఉండవు..కేవలం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి లోపలకు వెళ్లటం వల్ల కొవ్వుగా మారుతాయి. బరువు పెరగడానికి ప్రధాన కారణం..ఈ మైదాపిండిని ఎక్కువగా వాడుకోవటం.
ఇంకా ఈ పిండివల్ల బ్లడ్ లో ట్రైగ్లిజరయిడ్స్ పెరుగుతాయి. ఇవి ఎక్కువ అవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
మైదాపిండి వాడటం వల్ల షుగర్ ఉన్నవారికి ఇంకా షుగర్ లెవల్స్ పెరుగుతాయి..లేనివారికి అధికంగా తినటం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. అసలు షుగర్ వ్యాధికి మైదాకు సంబంధం ఏంట్రా అంటే..మైదాపిండి రిఫైన్ చేయటం వల్ల తేలిగ్గా డైజెషన్ అయిపోతుంది. త్వరగా రక్తంలోపలికి చెక్కరగా మారి వెళ్లిపోతుంది.
షుగర్ పెరగడానికి, ట్రైగ్లిజరయిడ్స్, కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, పక్షవాతానికి, మలబద్ధకం, క్యాన్సర్, జీర్ణకోస సమస్యలకు, కడుపునొప్పి రావడానికి, ప్రేగుల్లో బాడ్ బాక్టీరియా ఫామ్ అవడానికి మైదానే కారణం అవుతుంది.
మైదాపిండి తయారుచేసేప్పుడు..నిల్వ ఉంటే పురుగుపట్టకుండా ఉండేందుకు అందులో అలోగ్జాన్, బైంజాయిల్ పెరాయిక్సైడ్ అనేది కలుపుతారు. ఇవి బ్లీచింగ్ ఏజెంట్స్. ఇది ఎక్కువగా బాడీలోకి వెళ్తే..బీటాకణాలను డామేజ్ చేస్తాయి.
ప్రిజర్వేటీస్ కూడా మైదాలో కలుపుతారు. దానివల్ల క్యాన్సర్ రావడం ఎక్కువగా జరుగుతుంది. మైదాపిండి టేస్ట్ గా ఉండటం కోసం..న్యూడిల్స్ తయారుచేసేప్పుడు MSG మోనో సోడియం గ్లుటమెట్. ఇది మంచిది కాదు..మైదాపిండితో తయారుచేసే కేకులు, చాక్లెట్స్, బిస్కెట్స్, పిజ్జా, బర్గర్లు ఇవన్నీ విపరతీతంగా పిల్లలు తినేస్తున్నారు.

మైదాకు ప్రత్యామ్యాయం

పిజ్జాబేస్ తయారు చేయడానికి మైదాపిండినే వాడక్కర్లేదు. ఓట్స్ ను పొడి చేసి ఒట్స్ పౌడర్ వాడొచ్చు. మల్టీగ్రెయిన్ పిండితో పిజ్జా బేస్ తయారుచేసుకోవచ్చు. గోధుమ పిండి వాడాలంటే..పాలిష్ పట్టని పిండి వాడుకోవచ్చు. సొయాచిక్కుడు గింజలు ఎండపెట్టేసి పౌడర్ చేసి పిజ్జా బేస్ కు వాడుకోవచ్చు. శనగపిండి కూడా వాడుకోవచ్చు. చిలకడదుంప ఉడకపెట్టేసి..దాన్ని మెత్తగా పేస్ట్ లా చేసి పిజ్జా బేస్ లా వాడుకోవచ్చు. ఇన్ని రకాలు అవకాశాలు ఉన్నప్పుడు మైదానే వాడాలి అనుకోవడం మీ పొరపాటే..పిల్లలను రక్షించుకోవాలంటే..ముందు మీకు ఎలాంటి ప్రత్యామ్యాలు ఉన్నాయో తెలుసుకోవాలని ఈ కథనం మీకు అందించటం జరిగింది. ఈ సారి నుంచి పిజ్జా చేసుకునేప్పుడు వీటితో తయారుచేసుకుని చూడండి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version