పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ..!

-

నేటి ఆధునిక ప్రపంచంలో పిల్లలు చదువులతో ర్యాంకుల వెంట పరుగులు తీస్తున్నారు.ఒక విధమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఒత్తిడిలో పడి ఆహారం మీద శ్రద్ద పెట్టడం లేదు. దీనితో చదువు మీద మనసు లగ్నం కాదు సరి కదా శరీరం అలసటకు గురవుతుంది. అందుకని శరీరానికి ఒత్తిడిని దూరంచేసి, శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.ఈ సమయం  ప్రతి విద్యార్థికి పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం.

పరీక్షల్లో మంచి ర్యాంకుల కోసం కష్టపడటానికి మెదడు చురుగ్గా పని చేయాలి. అలా పని చేయాలంటే శరీరానికి శక్తిని, మెదడుకు ఉల్లాసాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవాలి. అటువంటి ఆహారం ఏమిటో తెలుసుకుందాము. కొందరు విద్యార్థులు పగలు, రాత్రి తేడా లేకుండా చదువుతూ ఏదో ఒకటి అని టీలు, కాఫీలు లేదా బేకరి ఫుడ్స్ తింటారు. ఇవి ఎంత తగ్గిస్తే అంత మంచిది ఆరోగ్యానికి.

ఇలాంటి ఆయిల్ ఫుడ్స్,ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల  మెదడు చురుకుతనం కోల్పోవడమే కాక త్వరగా నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. వీలైంత వరకు తేలికగా జీర్ణమయ్యే  ఇంటి ఆహారం తీసుకోవాలి. వెంటనే శక్తినిచ్చే పళ్ళు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆకు కూరల్లో ఏ విటమిన్ కళ్ళకు మేలు చేస్తుంది.  టైముకి తింటూ చదువుకుంటే మైండ్ కి బాగా ఎక్కుతుంది. వీలైనంతవరకు ఆహ్లాదంగా, గాలి వెలుతురు ఉన్న చోట కూర్చోవాలి.  నీరు ఎక్కువగా తాగాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version