ఉడికి ఉడక్కని అన్నం.. నీళ్ల సాంబార్.. సీఎం సొంత ఇలాఖాలో ఇదీ దుస్థితి

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా నారాయణపేట కోస్గిలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాక్ష్యాత్తు సీఎం సొంత ఇలాఖాలో ఇంతటి దారుణ పరిస్థితులు నెలకొనడంపై విద్యార్థుల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

సీఎం నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన పథకం బాగా లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రొడ్డెక్కే పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ఓ పేపర్ క్లిప్పింగును దానికి అటాచ్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇలా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పని తీరు ఎలా ఉందో కోస్గి ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూస్తే తెలిసిపోతుంది అని మాజీ మంత్రి ఎద్దేవాచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version