నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు తాజాగా ఈ బ్యూటీకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. ఇంటర్నేషనల్ బ్రాండ్ కి అంబాసిడర్ గా మారింది రష్మిక. జపనీస్ ఐకానిక్ ఫ్యాషన్ బ్రాండ్ ఓనిట్సుకా టైగర్కు ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. ఇది ఓ షూస్ బ్రాండ్. ఈ బ్రాండ్ షూస్ ధరించి తాజాగా రష్మిక ఫొటోషూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
తాజాగా రష్మిక నెట్టింట షేర్చ చేసిన ఫొటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ డ్రెస్సులో రష్మిక హొయలు పోయింది. పరవశంతో దిగిన ఫొటోలు చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నారు. రెండు చేతులు పైకెత్తి విరహంతో కూడిన పోజులిస్తూ మెస్మరైజ్ చేసింది. మరోవైపు కవ్వించే లుక్స్ తో నెట్టింట హీట్ పుట్టించింది.
ఓవైపు సౌత్ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామ ఇటీవల బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకుంటూ తన సత్తా చాటుతోంది. నార్త్ లో రష్మికకు మంచి ఫాలోయింగ్ ఉంది.