ఎన్టీఆర్ ఇప్పటికి వరకు సహాయం చేయలేదు : అభిమాని తల్లి

-

కౌశిక్ అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని క్యాన్సర్ తో బాధపడుతుండగా చావు బతుకుల మధ్య ఉన్న అతనితో వీడియో కాల్ లో మాట్లాడి.. ఆదుకుంటానంటూకు జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. కానీ ఇప్పటికి ఎలాంటి సాయం చేయాలేదని.. తన కోడుకు కాపాడాలని కౌశిక్ తల్లి సరస్వతి వేడుకుంటుంది. ఏపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయంతో కౌశిక్ కు ఇప్పుడు ఆపరేషన్ పూర్తి అయ్యింది. మరో 20 లక్షల రూపాయల ఆసుపత్రి ఫీజులు చెల్లించాల్సి ఉండగా దానికై అవస్థ పడుతున్నారు కౌశిక్ కుటుంబ సభ్యులు. ఇంకా చెన్నై అపోలో లోనే చికిత్స పొందుతున్నాడు కౌశిక్.

అయితే 77 లక్షలు ఇవ్వాల్సి ఉండగా. చివరికి ఇరవై లక్షలు అయినా అందిస్తే డిశ్చార్జ్ చేస్తాం అని అపోలో ‌‌వాళ్ళు అంటున్నారు. కానీ సహాయం చేస్తామన్న ఎన్టీఆర్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఫలితం లేదంటున్నారు కౌశిక్ తల్లి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసిన స్పందన లేదంటున్నారు సరస్వతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version