అన్నింటికన్నా బాదంపప్పు లోనే పోషకాలు ఎక్కువట… సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..

-

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవాలని అందరికీ తెలిసిందే. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఇలా అన్ని పోషకాలు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ అనారోగ్య సమస్యలూ రాకుండా ఉంటాయి. అయితే అన్ని పోషకాలూ ఏయే ఆహార పదార్థాలలో ఉంటాయో చాలా మందికి తెలియదు. దీంతో నిత్యం అన్ని పోషకాలు అందాలంటే వేటిని తినాలో అని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే సైంటిస్టులు ఈ సందేహానికి పరిష్కారం కనుగొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా మనకు అందుబాటులో ఉన్న అనేక ఆహార పదార్థాలలో వేటిలో అన్ని పోషకాలు ఉంటాయి అనే అంశం పై పలువురు సైంటిస్టులు ఇటీవలే పరిశోధనలు చేపట్టారు. దీంతో తెలిసిన విషయం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఆహారపదార్థాల్లోనూ అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారం బాదంపప్పు అని తేల్చారు. బాదం పప్పులో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. అధిక బరువును తగ్గిస్తాయి. డయాబెటీస్ రాకుండా చూస్తాయి. అలాగే మన శరీరానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్లు, మినరల్స్ ను మనకు బాదంపప్పు అందిస్తుంది.

మనకు అందుబాటులో ఉన్న అనేక ఆహార పదార్థాల్లో అత్యంత ఎక్కువ పోషకాలు బాదంపప్పు లో ఉన్నందున వాటిని నిత్యం తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు. బాదంపప్పు ను నిత్యం తీసుకోవడం వల్ల పోషకాహార లోపం లేకుండా చూసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఈ పప్పును రోజూ ఇస్తే వారికి పెద్దయ్యాక అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని వారు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version