కడుపులోంచి అప్పడప్పుడు మనకు కొన్ని పేగు శబ్ధాలు వస్తుంటాయి. అయితే మనం ఎందుకు వస్తాయి అనేది పెద్దగా పట్టించుకోము. మనం తిన్న ఆహారం జీర్ణాశయంలో జీర్ణం అయ్యాక చిన్న పేగులకు చేరుతుంది. అక్కడ ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకుంటుంది. తరువాత మిగిలిన వ్యర్థాలు పెద్ద పేగు ద్వారా బయటకు వస్తాయి. ఇదంతా ఒక ప్రాసెస్‌లో జరుగుతుంటుంది. ఈ టైంలోనే..శబ్ధాలు వస్తాయి. కడుపులో నుండి శబ్దాలు ప్రేగుల కదలిక ద్వారా ఆహారాన్ని నెట్టడం ద్వారా ఏర్పడతాయి. పైపుల్లో నుండి నీరు ప్రవహించే సమయంలో ఎలా అయితే శబ్ధం వస్తుందో అదేతరహాలో పేగుల్లో నుండి శబ్దాలు పొట్ట పై భాగానికి వినిపిస్తుంటాయి.
చాలా ప్రేగు శబ్దాలు సాధారణమైనవి. ఈ శబ్దాలు ఎలాంటి హానిచేయనివనే అని చెప్పాలి. అయితే అసాధారణ శబ్దాలు సమస్యను సూచిస్తున్నట్లుగా మనం గ్రహించాలి. పేగుల్లో ఆహారం కదలికల వల్ల కొన్ని సార్లు గ్యాస్ ఏర్పడి అది శబ్దాలుగా మారుతుంది. అయితే ఒక మోస్తరు స్థాయిలో శబ్దాలు వస్తే
పెద్దగా ఖంగారు పడాల్సిన పనిలేదు. అది సాధారణమే. దాంతో ఎలాంటి హానీ ఉండదు. కానీ అసలు శబ్దాలు రాకపోతే.. అలాంటి వారు మలబద్దకంతో బాధపడుతున్నట్లు అర్థం. లేదా ఇతర జీర్ణ సమస్యలు ఏవైనా ఉన్నాయని సంకేతం. అలాంటి వారికి పేగుల నుంచి శబ్దాలు రావు.
నిద్రలో హైపోయాక్టివ్ ప్రేగు శబ్దాలు సాధారణం. కొన్ని మందులు వాడిన తర్వాత పొత్తికడుపు శస్త్రచికిత్స తర్వాత కూడా ఇవి సాధారణంగా వస్తుంటాయి. ప్రేగు శబ్దాలు తగ్గడం లేదా లేకపోవడం తరచుగా మలబద్ధకాన్ని సూచిస్తాయి. ఇక పేగుల నుంచి శబ్దాలు మరీ ఎక్కువగా వస్తుంటే.. గ్యాస్ లేదా విరేచనాల సమస్య ఉందని తెలుసుకోవాలి. లేదా వికారం, వాంతులు అయ్యే వారికి, అవబోతున్న వారికి కూడా ఇలా పేగుల నుంచి ఎక్కువగా శబ్దాలు వస్తుంటాయి. కనుక శబ్దాల తీవ్రతను బట్టి మనకు కలిగే అనారోగ్య సమస్యలను ముందుగానే అంచనా వేసుకోవచ్చు. శబ్దాలు అసలు రాకపోయినా, మరీ ఎక్కువగా వస్తున్నా వైద్యుడిని సంప్రదించటం మంచిది. అంటే..ఒక మాదిరిగా ఈ సౌండ్స్ రావటం మంచిదే..అదే అసలు రాకున్నా..ఎక్కువగా వస్తున్నా ప్రమాదం అన్నట్లు.