తాలిబన్ పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చే.. హింస.. ఎందుకంటే వారికి ఇలాకాలో ఉండే ప్రజలకు కఠిన తరమైన హుకుంలు జారీ చేసి.. నిబంధనలు అతిక్రమించిన వారిని కఠినంగా శిక్షిస్తుంటారు. అయితే.. ఇటీవల అఫ్ఘానిస్తాన్‌ను కూడా ఆక్రమించిన తాలిబన్‌లు ఇప్పుడు శాంతిని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే తాజా పరిణామాల దృష్ట్యా తాలిబన్ సర్కార్ అమెరికాతో సత్సంబధాలు కొనసాగించేందుకు అడుగులు వేస్తున్న తరుణంలో.. తాలిబాన్ ప్రభుత్వ హోంమంత్రి సిరాజుద్దీన్ హక్కానీ కీలక ప్రకటన చేశారు. కేవలం అమెరికాతో మాత్రమే కాకుండా… ప్రపంచ దేశాలన్నింటితోనూ తాము సత్సంబంధాలనే నెరుపుతామని తాలిబాన్ ప్రభుత్వ హోంమంత్రి మంగళవారం కీలక ప్రకటన చేశారు.
గత 20 ఏళ్లుగా తాము యుద్ధాలు, రక్షణ రంగం అంటూ గడిపేశామని గుర్తు చేసుకున్నారు సిరాజుద్దీన్ హక్కానీ. దోహా ఒప్పందం తర్వాత వాటి గురించి మాట్లాడొద్దని నిర్ణయించుకున్నామని సిరాజుద్దీన్ హక్కానీ పేర్కొన్నారు. ఇకపై వాటి ఊసే ఎత్తమని, అమెరికాతో సహా అన్ని దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని ఆయన వెల్లడించారు సిరాజుద్దీన్ హక్కానీ. బాలికలకు విద్య అన్న విషయంపై హక్కానీ కీలక ప్రకటన చేశారు. బాలికలకు విద్యా సదుపాయం కల్పించే విషయంలో అతి తొందర్లోనే ఓ మంచి నిర్ణయం తీసుకుంటామని సిరాజుద్దీన్ హక్కానీ ప్రకటించారు. ఓ పద్ధతి ప్రకారం ఈ విషయంపై వ్యవహరిస్తామని, స్త్రీ, పురుషులిద్దరికీ విద్య కావాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు సిరాజుద్దీన్ హక్కానీ.