అవాంఛిత రోమాలు తొలగించుకునే న్యాచురల్ రెమిడీస్..

-

లేడీస్ కి అవాంఛిత రోమాలు సమస్య తెగ ఇబ్బందిపెట్టేస్తుంది. అవసరమైన చోట జుట్టు రమ్మన్నా రాదు.. అవసరం లేని చోట మాత్రం తెగ ఉంటుంది. ముఖం పై హెయిర్ ఉంటే.. ఎంత చిరాకుగా ఉంటుంది.. ఈ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి.. ఏవేవో క్రీమ్స్, షేవింగ్ చేస్తుంటారు.. కానీ వీటివల్ల మళ్లీ పదిరోజులకి సీన్ రిపీట్ అవుతుంది. అసలు శాశ్వతంగా ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి. లేజర్ ట్రీట్మెంట్ తో చేసుకోవచ్చు కానీ.. కాస్త ఖర్చు ఎక్కువ.. ముఖం మీద లేజర్ ట్రీట్మెంట్ అంటే.. అది స్కిన్ కు ఎఫెక్ట్ అవుతుంది. అందుకే.. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా.. వీటని తగ్గించుకునే మార్గాలు చూద్దాం.
పసుపు, శెనగపిండి, వేపాకు పొడి, పచ్చి పాలు మిశ్రమంగా చేసుకోని… ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టి.. 20 నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత చేతి వేళ్ళతో మృదువుగా మర్ధనా చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.
గుడ్డులోని తెల్లసొన, టేబుల్‌స్పూన్‌ చక్కెర, అర-టీస్పూన్‌ కార్న్‌ఫ్లోర్ లను ఒక బౌల్‌లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. అలా తయారైన పేస్ట్ ను రోమాలు పెరిగే దిశలో అప్లై చేయాలి. కాసేపటి తర్వాత వ్యతిరేక దిశలో లాగేస్తే అవాంఛిత రోమాలు ఊడిపోతాయి.
చాలా మంది మహిళలకు అప్పర్ లిప్స్ పై మీసాల్లా కనిపిస్తుంటాయి. వీటిని తొలగించుకోవాలంటే.. పసుపు, పెరుగు, బియ్యంప్పిండి మూడు కలిపి ఫెస్ ఫ్యాక్ తయారు చేసుకుని అప్లై చేయాలి. 15 నిమిషాలు తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. వారానికి ఒకసారి చేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.
ఒక స్పూన్ తేనెలో అరటీ స్పూన్‌ నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి… అరగంట తరువాత వేడి నీళ్లలో ముంచిన క్లాత్‌తో తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల అవాంఛిత రోమాల పెరుగుదల తగ్గుతుంది.
బొప్పాయి పండును గుజ్జులా చేసుకోవాలి. అందులో టీస్పూన్‌ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలు ఉన్న చోట మృదువుగా రుద్దాలి. కొంతసమయం తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేయడం వల్ల రోమాల సమస్య క్రమంగా తగ్గుతాయి.
పుదీనా ఆకులతో టీ తయారు చేసుకుని ప్రతిరోజు రెండు కప్పుల చొప్పున తీసుకోవటం వల్ల మహిళల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గుతుంది. అంతేకాకుండా అవాంఛిత రోమాలు తొలిగిపోతాయి. ఇతర సమస్యలకు పుదీనా మంచి ఔషదంగా పనిచేస్తుంది. హార్మోన్ల ఇంబాలెన్స్ వల్ల కూడా కొందరికి విపరీతంగా అవాంఛిత రోమాలు వస్తాయి. కాబట్టి.. తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్, నట్స్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.

 -Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version