వివేకానంద రెడ్డి హత్య కేసుపై కడప ఎస్పీ అశోక్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షుల మరణాలపై అనుమానాలు ఉన్నాయని బాంబ్ పేల్చారు కడప ఎస్పీ అశోక్ కుమార్. రంగన్న సహా ఇప్పటి వరకు ఐదుగురు సాక్షులు చనిపోయారని… స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి సాక్షుల మరణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు కడప ఎస్పీ అశోక్ కుమార్.
వివేకా హత్య కేసులో ఇప్పటి వరకు నలుగురు సాక్షులు శ్రీనివాసులరెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, రంగన్న చనిపోయారని వెల్లడించారు. నిన్న రంగన్న చనిపోవడంపై ఆయన భార్య ఫిర్యాదు చేయగా, అనుమానాస్పద మృతి కింద విచారణ చేస్తున్నామని ప్రకటించారు కడప ఎస్పీ అశోక్ కుమార్. గతంలో సాక్షులు చనిపోయినప్పుడు పోలీసులు, సీబీఐని నిందించారు, వీరి మృతిపై అనుమానాలు ఉన్నాయి, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని వివరించారు కడప SP అశోక్ కుమార్.