చర్మ సంరక్షణ కోసం మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన విత్తనాలు..

-

మిలమిల మెరిసే చర్మం కోసం మార్కెట్లో దొరికే అనేక రసాయనాలను ఉపయోగించి ఉంటారు. వాటి ప్రభావం చాలా కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. మీరు నిజంగా చర్మ సంరక్షణ కోసం చూస్తున్నట్లయితే కొన్ని ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో విత్తనాలు కూడా ఉండాలి. మిలమిల మెరిసే చర్మం నుండి చర్మ సమస్యలు పోగొట్టడం వరకూ ఈ విత్తనాలు బాగా పనిచేస్తాయి.

 

గుమ్మడి గింజలు

గుమ్మడికాయ గింజల్లో జింక్ అధికంగా ఉంటుంది. దీనివల్ల చర్మానికి వృద్ధాప్య ఛాయలు దరి చేరవు. ఇంకా గుమ్మడిలో ఉండే విటమిన్-ఈ, ఇతర కొవ్వు ఆమ్లాలు కొల్లాజెన్ ని ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. చర్మాన్ని తేమగా ఉంచడంలో గుమ్మడి గింజలు చాలా సాయం చేస్తాయి.

చియా విత్తనాలు

చియా విత్తనాలు చర్మాన్ని పోషించడంలో ముందుంటాయి. ఇందులో ఉండే ఒమెగా 3కొవ్వు ఆమ్లాలు చర్మ రక్షణకి ఉపయోగపడతాయి. చర్మాన్ని మెరిసేలా చేసుకోవాలని అనుకున్నవారు ఈ చియా విత్తనాలకి మీ ఆహారానికి జోడించుకోవచ్చు.

అవిసె గింజలు

హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే చర్మ సమస్యలను దూరం చేయడంలో అవిసె గింజలు బాగా తోడ్పడతాయి. మొటిమలు, మంటలను తగ్గించుకోవడానికి అవిసెగింజలు బాగా పనిచేస్తాయి. ఐతే వీటిని మోతాదు మించి వాడడం సరైన చర్య కాదు.

పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు

చర్మానికి సంబంధించి సూపర్ ఫుడ్ లను చెప్పుకుంటే అందులో పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు మొదటి స్థానంలో ఉంటాయి. మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి పొషకాలతో పాటు విటమిన్-ఏ, బీ1 మొదలగునవి ఉంటాయి. ఇంకా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు సహకరిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version