పీరియడ్స్ సమయంలో మహిళలు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇది ప్రతి నెల జరిగే ఒక ప్రక్రియ మరియు ఇటువంటి సమయంలో స్త్రీలకు విశ్రాంతి ఎంతో అవసరం అనే చెప్పాలి. కొంతమంది పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో చాలా మంది పెయిన్ కిల్లర్స్ ను తీసుకుంటారు. కాకపోతే డాక్టర్ సూచించిన తర్వాత మాత్రమే పెయిన్ కిల్లర్స్ పీరియడ్స్ సమయంలో తీసుకోవాలి. తరచుగా డాక్టర్ సూచనలు తీసుకోకుండా పెయిన్ కిల్లర్స్ ను ఉపయోగించడం వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తో బాధపడాల్సి ఉంటుంది.
అయితే పీరియడ్స్ సమయంలో వచ్చే ఎన్నో సమస్యలను తగ్గించుకోవడానికి పైనాపిల్ మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. కనుక పీరియడ్స్ సమయంలో పైనాపిల్ ను తప్పకుండా తీసుకోండి. దీనిలో ఉండే బ్రోమెలైన్ పీరియడ్స్ నొప్పిని మరియు తీవ్రతను తగ్గిస్తుంది. సహజంగా పీరియడ్స్ లో ప్రోస్టాగ్లాండిన్ల స్థాయిలు ఎక్కువ అవ్వడం వలన పీరియడ్స్ సమయంలో నొప్పి, అసౌకర్యం, తిమ్మిరి వంటివి ఎదురవుతాయి. అయితే ఈ బ్రోమెలైన్ ప్రోస్టాగ్లాండిన్లను తగ్గించడానికి మేలు చేస్తుంది.
కేవలం పీరియడ్స్ సమయంలో మాత్రమే కాకుండా పైనాపిల్ ను సహజంగా కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన పైనాపిల్ లో ఉండే విటమిన్ సి, మాంగనీస్ గర్భాశయ కండరాలకు సహాయపడతాయి. కొంతమంది మహిళలు నెలసరి సమయంలో ఉబ్బరం సమస్యతో బాధపడుతూ ఉంటారు. దానిని తగ్గించడానికి పైనాపిల్ ఎంతో ఉపయోగపడుతుంది. కాకపోతే యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు తో బాధపడేవారు పైనాపిల్ తీసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి మొదలైన లక్షణాలు కనబడతాయి. కనుక అటువంటి సమస్యలు లేనప్పుడు పైనాపిల్ ను తప్పకుండా తీసుకోవచ్చు.