వీటికి మసాజ్‌ చెయ్యండి.. ఒత్తిడి నుంచి విముక్తి పొందండి!

-

ఈ రోజుల్లో ఒత్తిడి అనేది కామన్‌. ఏ పని చేయాలన్నా ఒత్తిడితో కూడుకున్నదే. చిన్న పని అయినా అందులో రిస్క్‌ కలిగి ఉంటుంది. అలాంటి కాలంలో బతుకుతున్నాం. అయినా సరే ఒత్తిడి నుంచి బయట పడేందుకు రోజూ పది నిమిషాలు కేటాయిస్తే చాలంటున్నారు వైద్య నిపుణులు. అదేంటో మాకు తెలుసులే.. యోగానే కదా అనుకుంటారేమో. అది ముమ్మటికి కాదు. మోగా మామూలు విషయం కాదు ఏకాగ్రతతో చేయాల్సిన పని. సులువుగా అయిపోయే పని ఒకటుంది. అదేంటంటే..

ఇటీవల కాలంలో పని ఎక్కువయితే చాలు యోగా, ధ్యానం అంటూ చేసేస్తున్నారు. అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలా అని అందరూ చేయలేకపోతున్నారు. వారు ఒత్తిడి నుంచి కూడా బయటపడలేకపోతున్నారు. అలాంటి వారందరికీ ఒక మార్గముంంది. అదేంటంటే.. పాదాలకు మసాజ్‌ చెయ్యండి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందండి అంటున్నారు వైద్య నిపుణులు. అయితే శరీరంలోని అన్ని అవయవాలన్నీ పాదాలలో కనిపిస్తాయి. ఎక్కడ ఏ అవయవం ఉంటుందో చాలా మందికి తెలియదు. ఆ భాగాలను ఈ ఫోటోలో చూడొచ్చు.

ఇటీవల కాలంలో ఎక్కువ పని, శారీరక శ్రమ అధికం అవ్వడం అందుకు ఏకైక సూచికగా శారీరక నొప్పి, అనారోగ్యం, అలసట, నిరాశ మొదలైన వాటికి కొరత ఉండడం లేదు. మనం వారినికి ఒకరోజు సెలవు తీసుకుంటే.. మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. కాబట్టి వారానికి ఒకసారి నూనెతో బాడీ మసాజ్‌ చేసి స్నానం చేయాలని కాసేపు వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచించారు.

తలపై నూనెతో మర్దన వల్ల తలనొప్పి, ఒత్తిడి మరియు ఇతర శరీర అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది అన్న విషయం అందరికి తెలిసిందే.. అలాగే పాదాలకు మసాజ్‌ చేస్తే. అది కూడా శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది అని అనేక వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అవును రోజువారీ పనులు చేసుకునేవారు అనేక వ్యాధులతో సతమతం అవుతున్నారు. అలాంటి వారు రోజూ పాదాలకు మసాజ్‌ చేసి నిద్రపోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు అని చెబుతున్నారు. నేచురోపతిక్‌ వైద్యుడు అయిన నీలోఫర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ ప్రకారం, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు 10 నుంచి 15 నిమిషాలు పాదాలకు మసాజ్‌ చేయడం వల్ల ఏకరీతిగా రక్త ప్రవాహం జరగుతుంది. పాదాలకు మసాజ్‌ చేయడం వల్ల మరికొన్ని ఉత్తమ ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. పాదాలపై అనేక ఆక్యుప్రెషర్‌ పాయింట్స్‌ ఉంటాయని వాటిని మసాజ్‌ చేయడం వల్ల యాక్టివేట్‌ అయి మనకి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోజూ రాత్రి పడుకునే ముందు ఒక్క అయిదు నిమిషాలు పాదాలకు మసాజ్‌ చేసుకోవడం వల్ల అనేక అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఏదైన ఆయిల్‌తో రోజు మసాజ్‌ చేసుకొని నిద్రపోతే.. శరీరం పూర్తిగా ఉత్తేజం కలిగి, ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇక నుంచి ఆరోగ్యం కోసం ఒక 10 నిమిషాలు కేటాయించుకొని మంచి జీవన విధానాన్ని పొందాలని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version