Black Salt vs White Salt: ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ ఆహార పదార్థాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ టిప్ ని పాటించాల్సిందే. ఉప్పు కూరకి రుచి. ఉప్పు ఎక్కువైనా, తక్కువైనా కూర మొత్తం రుచి లేకుండా ఉంటుంది. అయితే ఉప్పు విషయంలో కొన్ని నియమాలని పాటించాలి. ఉప్పు ముప్పు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బ్లాక్ సాల్ట్ లేదా వైట్ సాల్ట్ లో ఏది తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. రెండు ఉప్పులే కదా తప్పేముంది అని అనుకోవద్దు. బీపీ, అజీర్తి మొదలైన సమస్యలను కలిగించే అవకాశం ఉంటుంది. బ్లాక్ సాల్ట్ వలన కలిగే లాభాలు, వైట్ సాల్ట్ వల్ల కలిగే లాభాలు చూద్దాం.
బ్లాక్ సాల్ట్ vs వైట్ సాల్ట్ (Black Salt vs White Salt):
- బ్లాక్ సాల్ట్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. అదే వైట్ సాల్ట్ ని తీసుకుంటే అజీర్తి సమస్యలకు కారణం అవుతుంది. బీపీని కూడా పెంచే అవకాశం ఉంది.
- బ్లాక్ సాల్ట్ లో పొటాషియం బీపీని బ్యాలెన్స్ చేయడానికి సహాయం చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని నార్మల్ గా ఉంచుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం వైట్ సాల్ట్ లో ఉండే సోడియం బీపీ లెవెల్స్ ని పెంచుతుంది. ఎక్కువగా వైట్ సాల్ట్ తీసుకోవడం వలన బీపీ బాగా పెరుగుతుంది.
- బ్లాక్ సాల్ట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి బ్లాక్ సాల్ట్ సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. చూశారు కదా ఏ సాల్ట్ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందనేది. మరి ఇక మీరూ పొరపాటు చేస్తున్నట్లయితే వెంటనే మార్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి. అనేక రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండండి.