చియా గింజలతో మధుమేహం దూరం.. పైగా ఈ లాభాలు కూడా..!

-

ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలలో డయాబెటిస్ ఒకటి. డయాబెటిస్ తో చాలా మంది బాధపడుతున్నారు. నిజానికి ఈ రోజుల్లో మధుమేహం బారిన పడే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. దీనికి గల కారణం ఏమిటది సరైన జీవనశైలి లేకపోవడం. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం కూడా డయాబెటిస్ కి కారణమే.

డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ఆరోగ్య నిపుణులు చెప్పిన విధంగా అనుసరిస్తూ ఉండాలి. అలానే షుగర్ లెవెల్స్ ని చెక్ చేయించుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం వంటి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్లు షుగర్ లెవెల్స్ ని తగ్గించుకోవడానికి చియా సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. చియా గింజల్లో ఫైబర్, మెగ్నీషియం, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన మధుమేహం తగ్గుతుంది.

అలానే ఉబకాయం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కొలెస్ట్రాల్ ని కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. ప్రతి రోజు ఆహారంలో చియా సీడ్స్ ని తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. చియా సీడ్స్ ని ఒక గ్లాసుడు నీళ్లల్లో వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకొని గంటసేపు ఉంచి ఆ తర్వాత తాగాలి ఇలా చేయడం వలన డయాబెటిస్ తగ్గుతుంది అని ఆరోగ్య సమస్యలు ఉండవు. చియా సీడ్స్ ని ఇలా తీసుకోవడం వలన గ్లూకోస్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉండవు. కానీ పండ్ల రసాల్లో వీటిని మాత్రం వేసుకోకండి దీని వలన ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మధుమేహం ఉన్నవాళ్లు బాగా ఎక్కువగా ఈ గింజలను తీసుకోవడం వలన దుష్ప్రభావాలు ఎదురవుతాయి కాబట్టి అతిగా వీటిని తీసుకోకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version