పెళ్లి తర్వాత భార్యాభర్తలు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని సమస్యల కారణంగా విడిపోతారు. ఈరోజుల్లో చాలామంది విడిపోవాలని త్వరగా నిర్ణయించుకుంటున్నారు. అసలు భార్యాభర్తల మధ్య విడాకులు ఎందుకు అయిపోతున్నాయి..? విడిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజుల్లో భార్య భర్తలకు సహనం ఉండట్లేదు. ఉద్యోగం, కుటుంబం, ఇతర బాధ్యతల కారణంగా సహనం తగ్గిపోతుంది. సమస్యలు ఎక్కువైపోతున్నాయి. దీంతో విడాకులు తీసుకుంటున్నారు. అర్థం చేసుకోకపోవడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వలన ప్రతి చిన్న సమస్య కూడా పెద్దదిగా కనబడుతోంది.
దాని వలన వైవాహిక జీవితం పై ప్రభావం పడుతోంది. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే వాళ్ల మధ్య కమ్యూనికేషన్ బాగుండాలి. కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడితే మాత్రం దూరం పెరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. సఖ్యత లేకపోతే వాదనలు వస్తాయి. ఏ సమస్యని కూడా పరిష్కరించుకోవడానికి ఎవ్వడు. అలాంటి పరిస్థితుల్లో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు.
భార్యాభర్తల మధ్య గౌరవం చాలా ముఖ్యమైనది. ఒకరినొకరు గౌరవించుకోవాలి గౌరవం లేకపోతే ప్రేమ తగ్గుతుంది. విడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈరోజుల్లో చాలామంది భార్యాభర్తలు డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చి బంధాల విలువ మర్చిపోతున్నారు. దానివల్ల కూడా విడిపోతున్నారు. నమ్మకం లేని బంధం కూడా కష్టంగా ఉంటుంది. విడాకులు తీసుకోవాలని అనుకుంటారు.