అచ్చుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి గాయపడిన కొందరు కార్మికలకు విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్లారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఎవరికి ఏం కాదని, ధైర్యంగా ఉండాలని బాధితులకు ధైర్యం చెప్పారు చంద్రబాబు. వారికి అందిస్తున్న వైద్య చికిత్సపైనా ఆరా తీశారు.
బాధితులు పూర్తిగా రికవరీ అయ్యే వరకూ చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. తమ వారికి ఎలాంటి ప్రమాదం జరగదని, త్వరలోనే కోలుకుంటారని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని ఇచ్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలు ఆర్థిక సహాయం చేస్తామని కీలక ప్రకటన చేశారు. సాధారణంగా గాయపడిన వారికి రూ.25లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు చంద్రబాబు.