తాగితే లివర్ డామేజ్ అవుతుందని తాగే ప్రతి ఒక్కరికి తెలుసు.. అయినా ఎవ్వరూ ఆగరు.. ఇంకా లెట్స్ డామేజ్ ద లివర్ అంటూ దోస్తుగాళ్లు సిట్టింగ్‌కు పిలుస్తుంటారు. మరి తాగకపోయినా లివర్ పాడైతే పరిస్థితి ఏంటి..? మనం తాగడం లేదు కదా.. ఏం కాదులే అని హాయిగా ఉండొచ్చా..?
మన శరీరంలో వ్యర్థాలను శుభ్రం చేసే లివర్ ఎంత పాడైనా..దానికి కరెక్ట్ ఆహారాన్ని ఆరు నెలలు ఇస్తే చాలు.. మళ్లీ బండి లైన్‌లో పడుతుంది. అయితే లివర్ డేంజర్లో ఉంటే కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని మనం గుర్తెరిగి ఉండాలి.. అవేంటంటే..
మూత్రం రంగులో మార్పు
కాలేయం దెబ్బతినడం వల్ల మూత్రం రంగులో మార్పులు కూడా కనిపిస్తాయి. మనం ముందే చెప్పుకున్నా.. లివర్ వ్యర్థాలను క్లీన్ చేస్తుంది.. మరీ అది పనిచేయకుండా పడుకుంటే..ఆ వ్యర్థాలు ఎవరూ క్లీన్ చేయరు.. దాంతో మూత్రం రంగు చాలా పసుపు రంగులో మారుతుంది. కళ్ల చుట్టూ పసుపు రంగులో ఉంటాయి. ఇది కాలేయం దెబ్బతినే లక్షణం కావచ్చు. ఈ పరిస్థితిలో వెంటనే వైద్యులను సంప్రదించండి.
పొట్టపెరగడం..
కాలేయంలో మంట కారణంగా కడుపు పరిమాణం పెరుగుతుంది.. చాలామంది ఊబకాయం వల్ల పొట్ట పెరగుతుంది అని లైట్ తీసకుంటారు. ఇలాంటి తప్పు మీరు అస్సలు చేయొద్దు. కాలేయంలో మంటను నివారించేందుకు సకాలంలో చికిత్స చేసుకోకుంటే లివర్ పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మేలు. అలాగే ఉన్నట్టుండి పొట్ట పెరుగుతుంటే.. దానికి తగ్గించుకునే పనులు చేయండి.
విపరీతమైన అలసట
కాలేయం దెబ్బతింటే.. చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. దీంతో పాటు చర్మంపై పొడిబారడం, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు కూడా కాలేయ వైఫల్యం లక్షణాలు కావచ్చు. మీ కాలేయం బలహీనంగా ఉన్నప్పుడు మీ చర్మ కణాలు దెబ్బతింటాయి. అలాగే జుట్టు రాలడం ఎక్కువవుతుంది.
లివర్ ఆరోగ్యం కోసం ఆరోగ్యవంతమైన జీవనశైలి పాటించడంతో పాటు.. వ్యాయామం చేస్తే చాలు!