విటమిన్ డి తక్కువ ఉంటే.. వీటిని తీసుకోండి..!

-

ప్రతిరోజు కూడా పోషకాహారాన్ని తీసుకోవాలి. పోషకాహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. అయితే చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతూ ఉంటారు. విటమిన్ డి తక్కువగా ఉన్నట్లయితే ఇలా పెంచుకోవచ్చు. ఉదయం సూర్య రష్మి లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఉదయపు ఎండలో కాసేపు గడపడం వలన విటమిన్ డి బాగా లభిస్తుంది. సాల్మన్ చేపల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ గా సాల్మన్ చేపలని తీసుకుంటే విటమిన్ డి పుష్కలంగా అందుతుంది.

అలాగే పుట్టగొడుగుల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ గా వీటిని తీసుకుంటే కూడా విటమిన్ డి అందుతుంది. గుడ్డులో ఉండే పచ్చ సోనలో విటమిన్ డి అబిస్తుంది, ప్రతిరోజు ఉదయం ఒక గుడ్డును తీసుకోవడం మంచిది. అదే విధంగా ఆరెంజ్ జ్యూస్ తో కూడా విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ ని తాగితే కూడా విటమిన్ డి మనకి లభిస్తుంది.

వీటితో పాటుగా పాలు, పెరుగు, వెన్న, జున్ను వంటి పాల ఉత్పత్తులను తీసుకుంటే కూడా విటమిన్ డి చక్కగా లభిస్తుంది. విటమిన్ డి లోపం లేకుండా ఉండొచ్చు. విటమిన్ డి లోపం కనుక ఉన్నట్లయితే ఎముకల సమస్యలు వస్తాయి. అలాగే పలు దీర్ఘకాలిక సమస్యలతో కూడా బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి విటమిన్ డి సమృద్ధిగా ఉండేటట్టు చూసుకోండి. విటమిన్ డి లోపం లేకుండా ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు ఎముకల సమస్యలు వంటివి కూడా మీ దరి చేరవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version