సొరకాయ జ్యూస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

-

మనం ఎక్కువగా ఉపయోగించే కాయగూరలలో సొరకాయ ఒకటి. రుచితో పాటు అనేక పోషకాలు సొరకాయలో ఉన్నాయి. అయితే ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ సొరకాయను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

సొరకాయ విటమిన్ బి, సి తో పాటు ఐరన్, జింక్ సోడియంను కలిగి ఉంది. ఇది ఎక్కువ శాతం నీటిని మరియు తక్కువ కొలెస్ట్రాల్ ను కలిగి ఉంది.తరచూ సొరకాయ జ్యూస్ ని తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

సొరకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తరువాత సాల్ట్, జీరాపొడి,పుదీనా ఆకులను,మిరియాలపొడి అందులో కొంచెం నీళ్లు పోసి వేసి బాగా మిక్సీ పట్టించి వచ్చిన మిశ్రమాన్ని వడపోసి వచ్చిన పానీయాన్ని త్రాగాలి.సొరకాయలో నీటి శాతం ఎక్కువ. అందువల్ల ఇది చర్మాన్ని డీహైడ్రెషన్ బారిన పడకుండా చూస్తుంది.ఇది చర్మానికి కావలసినంత తేమను అందించి, స్కిన్ ను హెల్తీ మరియు గ్లోయింగ్ గా ఉంచుతుంది.

తక్కువ ఫ్యాట్ ఉండే ఈ పానీయాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల తేలిగ్గా బరువును తగ్గించుకునేందుకు చాలా బాగా ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది.ఇది మన శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపించి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.డయేరియా ను నివారించడంలో ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో నీటి శాతం మరియు మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి.ఈ జ్యూస్ విరోచనాలను నివారించడంతో పాటు శరీరం కోల్పోయిన ఖనిజాలను భర్తీ చేస్తుంది. నీరసం నిసత్వ అంటే సమస్యలను దూరం చేసుకోవడంలో కూడా సొరకాయ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి సొరకాయను నిత్యం మీరు ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి నీటి శాతం లభించడంతోపాటు ఇతర రోగాలను కూడా దూరం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version