పొట్ట తగ్గించాలనుకుంటున్నారా..? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు..

-

కుర్చోని చేసే జాబ్‌ ఆ మాత్రం పొట్ట రావడం సహజం అని.. పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్లు తమకి తాము సర్దిచెప్పుకుంటారు. కానీ మనిషి సన్నగానే ఉండి.. పొట్ట మాత్రం మూడో నెల ప్రెగ్నీస్సీ లా ఉంటే.. చూడ్డానికి ఏమాంతం బాగుండదు. సరైన లైఫ్‌ స్టైల్‌ పాటిస్తే.. బాడీని షేప్‌ఔట్‌ కాకుండా మెయింటేన్‌ చేయొచ్చు. పొట్ట ఎక్కువగా ఉంటే.. గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్‌, మధుమేహం, జీవక్రియల అస్తవ్యస్తం, పిత్తాశయ సమస్యలు, అధిక రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్‌ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి పొట్ట తగ్గించుకోవడం తప్పనిసరి.. దీనికోసం..కడుపు మాడ్చుకోవక్కర్లేదు. వేళకు తింటే చాలు. పొట్ట రాకుండా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే..

అల్పా హారము తప్పనిసరి : ప్రతి రోజూ ఉదయము అల్పాహారము తప్పనిసరిగా తీసుకోవాలి. ఉదయము ఆహారం తీసుకోక పోవటం వల్ల సాయంత్రవరకు శరీరానికి కావాల్సిన శక్తి అందదు. మీరు ముందు రోజు ఏ పది గంటలకో తిన్నారంటే.. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తే.. ఎన్నిగంటల పాటు పొట్ట ఖాళీగా ఉంటుందో మీరే ఆలోచించండి. దానివల్ల గ్యాస్‌ఫామ్‌ అయి లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి ఉదయం టిఫెన్‌ కడుపునిండా తినాలి. దాని వల్ల బరువు అదుపులో ఉంటుంది.

ఉప్పు తగ్గించండి- బరువు తగ్గాలంటే మీరు వీలైనంత ఉప్పు తగ్గించండి. అసలు పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. ఎంత ఉప్పుకు దూరంగా ఉంటే..బరువు అనేది అంత కంట్రోల్లో ఉంటుంది. ఉప్పుకు శరీరములో నీటిని, కొవ్వును నిల్వ చేసే గుణము ఉంటుంది. దీని పలితంగా బరువు పెరుగుతారు. రోజుకు 6 గ్రాములకు మించి ఉప్పు వాడకం అస్సలు మంచిది కాదు.

వేళకు తినండి- బరువు తగ్గాలంటే తినడం మానేయక్కర్లేదు.. తినేది మార్చేస్తే చాలు..తిండి మానేస్తే.. పొట్టతగ్గటం సంగతి పక్కన పెడితే.. చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లావు తగ్గాలన్నా, పొట్ట కరగాలన్నా మూడు పూటలా ఆహారము తీసుకోవాలి. అయితే, తినే ఆహారము విషయములో జాగ్రత్తలు పాటించాలి. శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు సమపాళ్ళలో లభించేలా ఆహారము తీసుకోవాలి.

నిత్య వ్యాయామాలు : నడక, పరుగు వంటి వ్యాయామాలు రోజు వారిగా కొనసాగించాలి. రోజుకు 3 కిలో మీటర్లు నడవటం వల్ల మంచి ఫ్రయోజనం ఉంటుంది. ఎముకలు బలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి నడక మంచిది. నడవటం వల్ల కొవ్వు కూడా కరిగుతుంది.

వేపుళ్ళు మానేయండి- రుచికి బాగుంటాయని ఎక్కువమంది వేపుడు కూరలు తింటారు. అయితే ఆరోగ్యరీత్యా వేపుడు కూరలు అసలు మంచివి కావు. ఉడికించిన కూరలు తినటం చాలా మంచిది. కాబట్టి కూరగాయలను ఉడికించి తర్వాత కొద్దిగా వేయించి తినడం ద్వారా రుచి, ఆరోగ్యము రెండూ లభిస్తాయి. చిప్స్‌ లాంటివి తినడం కూడా మంచిది కాదు.

రోజు మొత్తంలో నీరు బాగా త్రాగాలి- నీరు మన దాహానికి తగ్గట్టుగా తాగుతూ ఉండాలి. నీరు తాగడం వలన ఆహారము తీసుకోవడము తగ్గుతుంది. జీవ పక్రియ మెరుగవుతుంది. నీరు శరీరానికి చాలా అవసరము. రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు అయినా తాగాలి.

ఒత్తిడి వద్దు- నిరంతరం టెన్సన్‌ మంచిది కాదు. ఒత్తిడితో ఉన్నవారు ఆహారము అధికంగా తీసుకుంటారు. దీని వల్ల హార్మోనులు సమతుల్యము తప్పుతాయి. సరియైన సమయానికి అవసరమైన పని చేస్తూ మిగతా సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి. అవసరం లేని టెన్షన్స్‌ మోయకండి.

సాయంకాలం పస్తులు ఉండొద్దు- చాలామందికి ఈవినింగ్‌ అవగానే కడుపుకు బాగా ఆకలివేస్తుంది. ఆత్మారాముడు ఆకలితో పరుగులుపెడతాడు. మనకేమో బరువు తగ్గాలని ఉంటుంది. దాంతో ఇప్పుడు తిని మళ్లీ రాత్రికి తింటే బరువు తగ్గమేమో అని చాలామంది అలా సాయంత్రం ఖాళీ కడుపుతోనే ఉంటారు. ఇలా అస్సలు చేయొద్దు. సాయంకాలం ఏదో ఒకటి తినాలి. ఆకలితో ఉండకూడదు. ఎండిన పళ్ళు, కొవ్వులేని ఆహారపదార్ధములు, తాజా పండ్లు, ఫ్రూట్ జ్యూస్‌, క్యారెట్‌ ఇలా ఏదో ఒకటి తినండి.
Attachments area

Read more RELATED
Recommended to you

Exit mobile version