చూయింగమ్‌ నమలడం వల్ల యాసిడ్‌ రిఫ్లక్స్‌న్స్‌ తగ్గుతాయా..?

-

చూయింగమ్‌ నమలడం కాలేజ్‌ డేస్‌ నుంచి మనకు ఉన్న ముఖ్యమైన అలవాటు కదా..! టైమ్‌పాస్‌కు ఒకటి నోట్లు వేసుకుని గంటల తరబడి నములుతుంటారు. అసలే ఇది ఆటిట్యూడ్‌ సింబల్‌ అని చాలా మంది ఫీల్‌ అవుతుంటారు. చూయింగ్‌ నమలడం వల్ల దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది, అది పొరపాటున లోపలకి వెళ్తే పేగులకు చుట్టుకుపోతుంది, ఆ ఫ్లేవర్‌ వల్ల కడుపు సమస్యలు వస్తాయి అని పెద్దోళ్లు భయపెడుతుంటారు.. కానీ మీకు ఒక ఇంట్రస్టింగ్‌ విషయం చెప్పాలి.. ఏంటంటే.. చూయింగ్‌ వల్ల యాసిడ్‌ రిఫ్లక్స్‌ను తగ్గుతాయట..త్రేన్పులు, గ్యాస్‌ పెయిన్స్‌తో ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది బాధపడుతున్నారు.. ఈ సమస్యకు చూయింగ్‌ నమలడం పరిష్కారం అంటున్నారు..వైద్య నిపుణులు. ఎలానో తెలుసుకుందాం..!

చూయింగమ్‌ నమలడం వల్ల యాసిడ్‌ రిఫ్లక్స్‌న్స్‌ ఎలా తగ్గుతాయి..?

మీరు గమనించే ఉంటారు.. చూయింగమ్‌ నమలడం వల్ల నోట్లో నీళ్లు ఎక్కువ ఊరతాయి.. ఈ లాలాజలమే పొట్టలోని యాసిడ్‌తో పోరాడి..మీ సమస్యను నయం చేస్తుందట. ఇది బైకార్బోనెట్‌లా పనిచేస్తుంది. పొట్టలో పీహెచ్‌ స్థాయి ఎక్కువైనప్పుడు మనకు అసౌకర్యంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే చూయింగమ్‌ను నములుతారో.. ఆ లాలాజలం అన్నావాహిక గుండా పొట్టలోకి ప్రవేశిస్తుంది. అది పొట్టలోని ఆమ్లాన్ని క్లీన్‌ చేస్తుంది. అన్ని చూయింగమ్‌లు ఈ పనిచేయలేవు.. బైకార్బోనెట్‌ గమ్‌లు మాత్రమే.. మీ సమస్యను పరిష్కరిస్తాయి..

బైకార్బోనెట్‌ గమ్‌

కడుపులో గ్యాస్‌ సమస్యలను నయం చేసుకోవాలంటే… చాలా మంది ఈనో తాగుతుంటారు, గ్యాస్‌ మాత్రలు వేసుకుంటారు.. బైకార్బోనెట్‌ చూయింగ్‌ ద్వారా కూడా మీరు ఈ సమస్యను నయం చేసుకోవచ్చు.. ఇది సాధారణ చూయింగ్‌లా లాలజలాన్ని మాత్రమే కాదు.. యాసిడ్‌ న్యూట్రిలైజింగ్‌ పవర్‌ను కూడా మీకు అందిస్తుంది. దాంతో మీరు గ్యాస్‌, కడుపు ఉబ్బరం సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

పిప్పర్‌మెంట్‌ గమ్‌

పుదీనా మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు.. ముఖ్యంగా నోటి దుర్వాసను పోగెట్టేందుకు పుదీనా ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. పుదినా టీ తాగడం వల్ల కడుపులో జీర్ణసమస్యలు అన్నీ నయం అవుతాయి.. అలాగే. .పుదీనా ఫ్లేవర్‌తో చేసిన ఈ చూయింగ్‌ తిన్నా.. మీ గ్యాస్‌ సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చు.

ఈ విషయాలు మరవద్దు..

చూయింగ్‌లు సాధారణంగా తియ్యగా ఉంటాయి.. ఒక సమస్యను పరిష్కరించే క్రమంలో వేరొక సమస్యను సృష్టించుకోకూకడదు.. మీరు గ్యాస్‌ సమస్యను తగ్గించుకోవడానికి చూయింగమ్‌లను తినొచ్చు కానీ.. మంచివి ముఖ్యంగా షుగర్‌ ఫ్రీవి ఎంచుకోవడం చాలా ముఖ్యం.. షుగర్‌ ఆరోగ్యానికి శత్రువు లాంటింది.. తేనెపూసిన కత్తిలా అది మీపై దాడి చేస్తుంది.. తియ్యగా ఉందని తింటారు.. ఆ తర్వాత దీర్ఘకాలిక రోగాల బారిన పడాల్సి వస్తుంది. షుగర్‌ ఫ్రీ చూయింగమ్‌ను ఎంచుకోవడం వల్ల మీ నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది.. సైడ్‌ ఎఫెక్టస్‌ కూడా ఉండవు.

అసలు యాసిడ్‌ రిఫ్లక్స్‌న్స్‌ ఎందుకు వస్తాయి..?

సమస్యకు పరిష్కారం మాత్రమే కాదు. ఆ సమస్యను తిరిగి రాకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.. యాసిడ్‌ రిఫ్లక్స్‌న్స్‌ ఎందుకు వస్తాయో తెలుసా..? మీరు తినే ఆహారం వల్లనే.. టైమ్‌కు తినకపోవడం వల్ల, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినడం వల్ల, మసాలాలతో చేసిన ఆహారం పదే పదే తినడం వల్ల..ముఖ్యంగా తినేప్పుడు అతిగా వాటర్‌ తాగడం, అన్నాన్ని పూర్తిగా నమలకపోవడం వల్ల కడుపులో ఇలాంటి ఆమ్లాలు చేరతాయి.

చాలా మంది అన్నాన్ని ఫాస్ట్‌గా తింటారు. తినేప్పుడు అతిగా వాటర్‌ తాగుతారు. మన కడుపు చుట్టూ..యాసిడ్‌ వలయం ఉంటుంది.. ఇది ఎంత ఘాటుగా ఉంటే మనం తిన్న ఆహారం అంత త్వరగా అరిగిపోతుంది.. ఇది తయారు చేయడానికి పొట్టకు దాదాపు గంట పడుతుంది.. మీరు అన్నం తినేప్పుడు వాటర్‌ తాగడం వల్ల ఆ ఆమ్లం ఘాటు తగ్గిపోతుంది..దాని పీహెచ్‌ లెవల్స్‌ తగ్గిపోతే.. ఏం అవుతుంది.. పొట్ట మళ్లీ యాసిడ్‌ను తయారుచేసుకోవాలి.. మీరు తిన్న అన్నాన్ని అరిగించకుండా.. ఆ యాసిడ్‌ను తయారు చేస్తుంది. దానికో గంట పడుతుంది.ఈ లోపు మనం తిన్న ఆహారంలో ఉండే పులుపు, మసాలాలు అన్నీ లోపల ఆగం ఆగం చేస్తాయి.. దీని వల్లనే గ్యాస్‌ సమస్యలు, కడుపు ఉబ్బరం వస్తాయి.. అందుకే తినేప్పుడు ఎట్టిపరిస్థితుల్లో వాటర్‌ తాగకూడదని వైద్యులు చెప్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version