సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి – కల్వకుంట్ల కవిత

-

 

Kavitha Kalvakuntla: సీతక్క కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నానని డిమాండ్‌ చేశారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ మంత్రి సీతక్కను సీఎం రేవంత్‌ దారుణంగా మోసం చేసినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత. ఎమ్మెల్సీ కవిత చిట్ చాట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.

Kavitha Kalvakuntla on seethakka

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామని.. రేవంత్ రెడ్డి మహిళలను ఉద్యోగాల విషయం లో మోసం చేశారని ఫైర్‌ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతతో తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమ కరవు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌ డీఎన్‌ఏలోనే మోదీతో స్నేహం ఉందని, ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలిపారు కల్వకుంట్ల కవిత. సీఎం రేవంత్‌ భాష ఎలా ఉందన్న కవిత.. ఆయనపై కేసులు పెట్టాలని పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version