మూర్చవ్యాధికి మందులే వాడాలా..? ఇలాంటి జీవనశైలితోనూ దూరం చేసుకోవచ్చుగా..!

-

మూర్ఛవ్యాది కొందరికి పుట్టుకతోనే వస్తుంది. మరికొంతమంది మధ్యలో వస్తాయి..యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అలా వస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా కొందరికి మూర్ఛవ్యాధి వస్తుంది. వారసత్వంగా కూడా వస్తాయి. అసలు రావడానికి కారణాలు ఏంటి అంటే..మెదడులో ఉండే నరాల కణాల్లో ఎలక్ట్రిక్ ఇంపల్సస్ ఒకేసారి ఎక్కువ మొత్తంలో వచ్చి ఫైర్ అవుతాయి.
నరాల ద్వారా కొన్ని అవయువాలకు ఎక్కువ మొత్తంలో కరెంటు వెళ్లిపోతుంది. దానివల్ల ఫిట్స్ వచ్చేస్తాయి. అందుకే ఫిట్స్ వచ్చినవారికి..కొన్ని అవయువాల్లో చలనం ఉండదు, నోట్లో నుంచి నురగ కారుతుంది, కొన్ని సార్లు నాలుక కొరికేసుకుని రక్తం కూడా కారుతుంది. మళ్లీ దీని ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి రెండురోజులు పడుతుంది. ఈరోజు మనం ఫిట్స్ సమస్య రాకుండా ఉండాలన్నా, వచ్చిన సమస్యను తగ్గాలన్నా ఏం చేయాలో చూద్దాం.
చిన్నపిల్లలకు హై ఫీవర్ వల్ల ఫిట్స్ వస్తాయి. ఇది పెద్ద సమస్య కాదు. కొన్ని నెలల్లో తగ్గిపోతాయి. లైఫ్ టైం ఉండదు. కొన్ని అనారోగ్యకారణాల వల్ల ఫిట్స్ వస్తే..దాదాపు అవి లైఫ్ టైం ఉంటాయి. ఇక వారు జీవితకాలం మందులు వాడాలి. మందులు వాడకపోతే ఎక్కువగా రిపీటెడ్ గా వస్తాయి. అందుకే ఈ ఫిట్స్ సమస్యతో బాధపడేవారు డైలీ మందులు వాడుతుంటారు. అసలు మందులు లేకుండా ఫిట్స్ ను పూర్తిగా తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి. ఎవరికైతే..తక్కువ మోతాదులో మందులు వాడితే చాలు అని వైద్యులు అంటారో..వాళ్లు ప్రధానంగా తమ జీవనశైలీ మార్చుకుంటే..ఆ తక్కువ డోసులో మందులు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు.
బ్రెయిన్ సెల్స్ లో రిలీజ్ అయ్యే కెమికల్స్, టాక్సిన్ ఏరోజుకు ఆరోజుకు రిమూవ్ అవ్వాలంటే..బ్రెయిన్ కు వాటర్ సప్లై బాగా అందాలి. మంచినీళ్లు బాగా తాగాలి. ప్రేగులు క్లీన్ ఉండాలి. సెరటోనిన్ అనే హార్మోన్ 70శాతం ప్రేగుల్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. ప్రేగులు హెల్తీగా ఉంటే..ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి. బ్రెయిన్ సెల్స్ లో వచ్చే మార్పులను ఇది కంట్రోల్ చేస్తుంది. ఈ హార్మోన్ లేకపోతే..కంట్రోల్ ఉండదు.
మానసిక ఒత్తిడి లేకుండా రెగ్యులర్ గా ప్రాణాయామం చేయాలి.ప్రాణాయామం వల్ల బ్రెయిన్ సెల్స్ కి ఆక్సిజన్ సప్లై జరుగుతుంది. బ్రెయిన్ సెల్స్ బాగా రిలీక్స్ అవుతాయి. స్ట్రెస్, టెక్షన్ కూడా తగ్గుతుంది. అందుకే కనీసం 20-30 నిమిషాలైనా ప్రాణాయామం చేయాలి.
ఇక ఆహారం విషయానికి వస్తే..కార్భోహైడ్రెట్స్ 80-90 శాతం తగ్గించేయాలి. ఇవి ఎక్కువగా తినటం వల్ల బ్రెయిన్ కు ఎనర్జీ స్పీడ్ గా ఎక్కువగా వెళ్తుంది. స్లోగా ఎనర్జీ వెళ్లాలి..అందుకోసం ప్రొటీన్, ఫ్యాట్ ఫుడ్ తినాలి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తినాలి. ఇంకా మినరల్స్ ఎక్కువగా ఉన్న జ్యూస్ తాగాలి. అందుకనే సొరకాయ, బూడిద గుమ్మడి, కీరాదోసకాయ, టమోటా, క్యారెట్ జ్యూస్ తాగండి. వీటితో పాటు బ్రేక్ ఫాస్ట్ లో కొబ్బరి, పల్లీలు, మొలకలు వీటితో పాటు దానిమ్మ, కర్బూజ, యాపిల్, బొప్పాయి, పుచ్చకాయ తీసుకోవాలి. ఇక మధ్యాహ్నం కూడా వైట్ రైస్ మానేసి..మిల్లెట్ రైస్ లేదా పుల్కాలు తీసుకోండి. ఇక సాయంత్రం వండినవి కాకుండా..ప్రొటీన్ ఉన్న పుడ్ ఎక్కువగా తీసుకోండి..అంటే వాల్ నట్స్, పుచ్చగింజల పప్పు, పొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పు లాంటివి తినండి.
ఇలా తీసుకోగలిగితే..ఫిట్స్ వచ్చే వారికి మందులు వాడుతునే ఇవి నెల రెండు నెలలు వాడండి..సడన్ గా మందులు ఆపితే ప్రమాదం. అందులే ఓ పక్క మందులు వాడుతూనే..పైన చెప్పినట్లు చేస్తే..రెండు నెలలకే ఇంప్రూవ్ మెంట్ కనిపిస్తుంది. అప్పుడు డాక్టర్ సలహా మేరకు మందుల డోస్ తగ్గించండి..అలా నాలుగు ఐదు నెలల్లోనే పూర్తిగా మండులు వాడాల్సిన అవసరం లేకుండా పైన చెప్పిన జీవనశైలితో ఫిట్ సమస్యను తగ్గించుకోవచ్చు.
ఫిట్స్ భయాన్ని దూరంచేసుకుని…ఈ ఆహార నియమాలతో సమస్యకు చెక్ పెట్టండి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version